Hardik Pandya Injury Update :ముంబయి ఇండియన్స్ కెప్టెన్ స్థానంలో రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యకు సారథ్య బాధ్యతలు అప్పగించిన ఫ్రాంచైజీ యాజమాన్యానికి షాక్ తగిలినట్లైంది. ఇటీవల వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడ్డ హార్దిక్, వచ్చే ఏడాది ఐపీఎల్ నాటికి కూడా పూర్తిగా కోలుకోవడం కష్టమేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు 2024 ఐపీఎల్‌లోనూ ఆడే ఛాన్స్ లేదంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. అయితే మెగాటోర్నీలో గాయపడ్డ హార్దిక్ పాండ్య, జనవరిలో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్ నాటికి అందుహాటులోకి వస్తాడని అంతా ఆశిచారు. కానీ, గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల అతడు మరికొన్ని రోజులు ఆటకు దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ హార్దిక్ గైర్హాజరైతే, ముంబయికి ఎవరు సారథ్యం వహిస్తారన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఫ్రాంచైజీ రోహిత్‌కే పగ్గాలు ఇస్తుందనుకుందాం. కానీ, అతడు కెప్టెన్సీని అంగీకరిస్తాడన్నది డౌటే. రోహిత్ తర్వాత జట్టులో సీనియర్లుగా ఉన్న జస్ర్పీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లో ఎవరైనా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ, ఈ విషయంపై ముంబయి ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
Rohit Effect On MI Social Media Account: ముంబయి కెప్టెన్‌గా హార్దిక్‌ను ఎంపిక చేయడం రోహిత్ ఫ్యాన్స్ ఏ మాత్రం జీర్ణించుకోలేరు. ఫ్రాంచైజీపై విమర్శలు గుప్పిస్తూ, ముంబయి ఇండియన్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను దాదాపు 8 మిలియన్ మంది అన్‌ఫాలో కొట్టేశారు.