తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 World Cup: 'గత ఖ్యాతితోనే జట్టులో హార్దిక్, భువీ' - దిలీప్ దోషి వ్యాఖ్య

టీమ్​ఇండియా ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా(Hardik Pandya Bowling), భువనేశ్వర్ కుమార్​ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదని టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి(Dilip Doshi News) అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్​ నేపథ్యంలో రానున్న మ్యాచ్​ల్లో అశ్విన్, శార్దూల్​కు తుది జట్టులో అవకాశం కల్పించాలని యాజమాన్యాన్ని కోరాడు.

team india
టీమ్​ఇండియా

By

Published : Oct 30, 2021, 5:32 AM IST

ఈ టీ20 ప్రపంచకప్‌లోని(T20 World Cup 2021) టీమ్​ఇండియా ఆడే మిగతా మ్యాచ్‌లకు ఆటగాళ్లను గతంలో సాధించిన ఖ్యాతి ఆధారంగా కాకుండా ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయాలని భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి(Dilip Doshi News) యాజమాన్యాన్ని కోరాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా(Hardik Pandya News), ఫాస్ట్‌ బౌలర్‌ భువనేశ్వర్ కుమార్‌లు గతంలో సాధించిన ఆధారంగా టీమ్​ఇండియాకు ఆడుతున్నారని దోషి వ్యాఖ్యానించాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కొన్ని రోజులుగా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో రాబోయే మ్యాచ్‌ల్లో రవిచంద్రన్ అశ్విన్(ashwin last t20 match), శార్దూల్ ఠాకూర్‌ని తుది జట్టులోకి తీసుకోవాలని టీమ్​ఇండియా యాజమాన్యాన్ని కోరాడు.

"కొంతమంది ఆటగాళ్లు గతంలో సాధించిన ఖ్యాతి ఆధారంగా ఆడుతున్నారు. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ లాంటి ఆటగాళ్లు కొన్నిరోజులుగా తమ స్థాయికి తగ్గట్లుగా రాణించడం లేదు. హార్దిక్‌కు బాగా ఆడే సత్తా ఉంది. నిలకడగా ఆడేందుకు అతడు తన సామర్థ్యంపై దృష్టిపెట్టాలి. భువనేశ్వర్ 130 కి.మీ. వేగంతో బౌలింగ్‌ చేస్తూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టలేకపోతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ప్రతి మ్యాచ్‌ ఆడాలి. ఎందుకంటే అతడు ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్‌. శార్దూల్ కచ్చితంగా ఆడాలి. అతడు కొన్ని రోజులుగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీపక్ చాహర్‌ కూడా జట్టులో ఉండేందుకు అర్హుడు. కొన్నేళ్లుగా జడేజా బౌలింగ్‌ క్షీణిస్తోందని నాకనిపిస్తోంది. అతడు అత్యుత్తమ ఆటగాడు. కానీ, బౌలింగ్‌లో ప్రభావం చూపలేకపోతున్నాడు. జడ్డూ తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవాలి" అని దిలీప్‌ దోషి అన్నాడు.

ABOUT THE AUTHOR

...view details