టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్డ్. లోవర్ మిడిలార్డర్లో హార్దిక్ పాండ్య ఉత్తమ ఆటగాడని అభిప్రాయపడ్డాడు. భారత్-శ్రీలంక మధ్య సిరీస్ ఆదివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో జరిగిన వర్చువల్ కాన్ఫరెన్స్లో ఈటీవీ-భారత్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు ఆర్నాల్డ్.
బౌలింగ్ పరంగా కాకపోయినా బ్యాట్స్మన్గా అయినా పాండ్యను జట్టులో ఉంచుకోవడం అవసరమని ఆర్నాల్డ్ తెలిపాడు.
సర్జరీ అనంతరం 2019లో జట్టులోకి తిరిగొచ్చిన పాండ్య.. బ్యాటింగ్లో రాణించినప్పటికీ బౌలింగ్లో మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్ విషయంలో భారత్ సతమతమవుతోంది.