టీ20 ప్రపంచకప్ జట్టులో(India t20 world cup 2021 squad) టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు స్థానం దక్కుతుందని వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 17 నుంచి యూఏఈ, ఒమన్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup) కోసం ఇప్పటికే అనేక దేశాలు తమ జట్లను ప్రకటించాయి. బీసీసీఐ కూడా ఇటీవలే టీమ్‌ఇండియా జట్టును ప్రకటించింది. చాహల్‌కు మాత్రం ఈ జట్టులో స్థానం కల్పించలేదు. అయితే, అక్టోబర్ 10 వరకు తుదిజట్లలో మార్పులు చేసుకోవచ్చని ఐసీసీ పేర్కొంది. దీంతో భారత జట్టులో ఏవైనా మార్పులు, చేర్పులు చేస్తారా? అనే విషయంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో చాహల్(Yuzvendra Chahal News) జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని హర్భజన్ సింగ్ (Harbhajan Singh Latest News) ట్వీట్ చేశాడు.
"నువ్వు(చాహల్) ఎప్పటిలాగే అత్యుత్తమంగా ఉన్నావు. అదే ఫామ్‌ను కొనసాగించు. సరైన వేగంతో బౌలింగ్ చేస్తున్నానని నిర్ధారించుకో. చాలా నెమ్మదిగా బౌలింగ్ చేయకు. టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియాలో నిన్ను చూడాలని ఆశిస్తున్నా. ఛాంపియన్ బౌలర్" అని హర్భజన్ ట్వీట్ చేశాడు.