తెలంగాణ

telangana

ETV Bharat / sports

Harbhajan Singh Retirement: భజ్జీ.. యువ ఆటగాళ్లకు ఆదర్శం.! - cricketers on harbhajan

Harbhajan Singh Retirement:టీమ్​ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో పలువురు క్రికెటర్లు, మాజీలు శుభాకాంక్షలు తెలిపారు. యువ ఆటగాళ్లకు అతడు ఆదర్శమని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో గొప్ప స్పిన్నర్‌గా భారత్‌కి ఎన్నో మరుపురాని విజయాలు అందించాడని ప్రశంసించారు.

harbhajan singh retirement
harbhajan singh retirement

By

Published : Dec 24, 2021, 7:38 PM IST

Harbhajan Singh Retirement: టీమ్‌ఇండియా దిగ్గజ స్పిన్ బౌలర్‌ హర్భజన్‌ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ట్విటర్‌ వేదికగా అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లు సచిన్‌ తెందూల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, శ్రీశాంత్, ఆర్పీ పటేల్‌, పార్థివ్‌ పటేల్, ప్రగ్యాన్ ఓజా, వీరేంద్ర సెహ్వాగ్‌తోపాటు సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌, కుల్‌దీప్‌, ఉమేశ్‌, బీసీసీఐ సెక్రెటరీ జై షా తదితరులు హర్భజన్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

యువ ఆటగాళ్లకు అతడు ఆదర్శమని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో గొప్ప స్పిన్నర్‌గా భారత్‌కి ఎన్నో మరుపురాని విజయాలు అందించాడని ప్రశంసించారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా మరింత గొప్పగా రాణించాలని ఆకాంక్షించారు. 1998లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం హర్భజన్‌.. 2016లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పలు జట్ల తరఫున ఆడాడు.

ఇదీ చూడండి:Harbhaja Retirement: ఆ ఘనత సాధించిన తొలి ఆఫ్ స్పిన్నర్ భజ్జీ!

ABOUT THE AUTHOR

...view details