Harbhajan Singh Politics: టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే భజ్జీ రిటైర్మెంట్ అనంతరం అతడి సెకండ్ ఇన్నింగ్స్ గురించి పలు రకాల వార్తలు వస్తున్నాయి. వ్యాఖ్యత, కోచ్ లేదా మెంటార్‌గా మారతాడని కొందరు అంటుంటే.. మరికొందరు రాజకీయాల్లోకి రాబోతున్నాడని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించాడు హర్భజన్.
"తర్వాత ఏం చేయాలనేది ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయించుకుంటా. ఇంత పేరు సంపాదించానంటే దానికి కారణం క్రికెట్. అందుకే క్రికెట్‌తో అనుబంధం కొనసాగించడమే ఇష్టం. ఐపీఎల్ జట్టుకు మెంటార్‌గానో, కోచ్‌గానో ఉంటా. వీలైతే కామెంటరీ చేస్తా. రాజకీయాల్లోకి వెళ్తానా? లేదా? అనేదానిపై ఇప్పుడే ఏం చెప్పలేను"
-- హర్భజన్ సింగ్, మాజీ స్పిన్నర్.
Harbhajan Singh News: సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వెళ్లాలా? లేదా? అనేదానిపై ఆలోచిస్తానని చెప్పాడు భజ్జీ. రాజకీయాల గురించి పూర్తిగా అవగాహనలేదని తెలిపాడు. అయితే.. రిటైర్మెంట్ అనంతరం హర్భజన్.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతో భేటీ అయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు పంజాబ్ కాంగ్రెస్‌లో చేరతాడనే ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి.