టీ20 ప్రపంచకప్ సూపర్-12(T20 world cup 2021) దశలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అయితే ముగిసింది కానీ.. ఇరు దేశాల మాజీ ఆటగాళ్ల మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాక్ మాజీ పేసర్ మహమ్మద్ అమిర్ ట్విట్టర్(Harbhajan Singh vs Mohammad Amir) వేదికగా పరస్పరం ట్వీట్ల దాడి చేసుకున్నారు. దుబాయ్ వేదికగా గత ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్ల(IND vs PAK) మధ్య మ్యాచ్ జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై పాక్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్ పోటీల్లో దాయాది దేశం తొలి విజయాన్ని సాధించి గత రికార్డును చెరిపేసింది.
ఈ క్రమంలో పాక్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమిర్ పాత వీడియోను ట్విట్టర్‌లో(Mohammad Amir twitter ) షేర్ చేశాడు. అందులో హర్భజన్ బౌలింగ్‌లో షాహిద్ అఫ్రిది వరుసగా సిక్సర్లు బాదినట్లు ఉంది. దీంతో భజ్జీ.. 2010 ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అమిర్ వేసిన 'నో బాల్' క్లిప్పింగ్‌ను పోస్ట్(harbhajan singh twitter) చేశాడు.
దానికి "ప్రజలు నిన్ను చూసేది డబ్బు కోసం పాకులాడేవాడిగానే. గౌరవం, అభిమానం ఏమీ లేదు. కేవలం డబ్బు మాత్రమే ఉంది. మీ దేశ ప్రజలు మద్దతుదారులకు ఎంత లభించిందో మీరు చెప్పరు. క్రికెట్‌ను ఈ విధంగా అవమానించి.. ప్రజలను ఫూల్స్ చేసిన నీలాంటివారితో మాట్లాడుతున్నందుకు బాధగా ఉంది" ట్వీట్ పెట్టాడు.