తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ ఫ్రాంచైజీ మెంటార్​గా హర్భజన్.. త్వరలో రిటైర్మెంట్!

Harbhajan Singh Retirement: టీమ్ఇండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఇకపై ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సహాయ బృందంలో సభ్యుడిగా కొత్త అవతారంలో కనిపించనున్నాడు.

harbhajan singh retirement, harbhajan singh as IPL mentor, హర్భజన్ సింగ్ రిటైర్మెంట్, హర్భజన్ సింగ్ మెంటార్
harbhajan singh

By

Published : Dec 8, 2021, 8:54 AM IST

Harbhajan Singh Retirement: టీమ్‌ఇండియా వెటరన్ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టనున్నాడు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సహాయ బృందంలో సభ్యుడిగా కొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ తొలి దశలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున కొన్ని మ్యాచ్‌ల్లో బరిలో దిగిన భజ్జీకి యూఏఈలో జరిగిన రెండో దఫా లీగ్‌లో అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో వచ్చేవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి.. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించాలని 41 ఏళ్ల భజ్జీ భావిస్తున్నాడు.

"కన్సల్టెంట్‌ లేదా మెంటార్‌ లేదా సలహా బృందంలో సభ్యుడిగా భజ్జీ పాత్ర ఏదైనా అయ్యుండొచ్చు. అతని విశేష అనుభవాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. ఆటగాళ్ల వేలం సమయంలోనూ సదరు ఫ్రాంచైజీ తరఫున భజ్జీ కీలకంగా వ్యవహరించనున్నాడు" అని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి.

Harbhajan Singh IPL: గతంలో ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న సమయంలో వర్ధమాన ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడంపై భజ్జీ ఆసక్తి కనబరిచాడు.

ఇవీ చూడండి: వేలానికి ముందు విజయ్‌ హజారే టోర్నీ.. హార్దిక్ దూరం

ABOUT THE AUTHOR

...view details