Harbhajan Singh Dhoni: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీతో తనకెలాంటి విభేదాలు లేవని అన్నాడు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. మహీతో తన ప్రయాణం సాఫీగా సాగిందని, తామిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని చెప్పాడు.
"ధోనీతో నాకు ఎలాంటి విభేధాలు లేవు. నిజానికి ఇన్నేళ్లపాటు అతను నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు. నాకు బీసీసీఐతో విభేదాలు ఉన్నాయి. అప్పుడు ఉన్న సెలక్టర్లు తమ బాధ్యతలకు న్యాయం చేయలేదు."
-హర్భజన్ సింగ్, మాజీ స్పిన్నర్.
ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బీసీసీఐ, ధోనీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. బీసీసీఐ నుంచి తనకు ప్రోత్సాహం అందలేదని, జట్టు నుంచి అకారణంగా తప్పించారని అన్నాడు. ఈ విషయమై ధోనీని అడిగితే అతడు ఏమీ సమాధానం చెప్పలేదని అన్నాడు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయేమోనని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై భజ్జీ వివరణ ఇచ్చాడు.
కాగా, 2011 ప్రపంచకప్‌లో విజయం సాధించిన టీమ్ఇండియా జట్టులోని ఆటగాళ్లందరూ.. ఆ తర్వాత మళ్లీ ఎందుకు కలిసి ఆడలేదని ప్రశ్నించాడు హర్భజన్.
"ఓ విషయం గురించి మాట్లాడినప్పుడు చాలా మంది పలు రకాలుగా అర్థం చేసుకుంటారు. అయితే 2012 తర్వాత చాలా విషయాల్లో మార్పు వచ్చిందని నేను చెప్పాలనుకుంటున్నాను. సెహ్వాగ్, యువరాజ్, గంభీర్ ఐపీఎల్లో ఆడటం వల్ల ఆ సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఉండవచ్చు. 2011 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన టీమ్ఇండియా జట్టు.. ఆ తర్వాత మళ్లీ కలిసి ఎందుకు ఆడలేదు? ఆ జట్టులోని కొందరు ప్లేయర్లు మాత్రమే 2015 వరల్డ్‌కప్‌లో ఎందుకు ఆడారు. మిగిలినవారు ఎందుకు లేరు"
-హర్భజన్ సింగ్, మాజీ స్పిన్నర్.
1998లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. అనతికాలంలో జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. 31 ఏళ్లకే టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో తన స్పిన్ మాయజాలంతో టీమ్‌ఇండియాకు విజయాలందించిన భజ్జీ.. 2016 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించలేదు. అతడకి ఆ తర్వాత అవకాశాలు రాలేదు. మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు వస్తుందని భావించిన ఈ వెటరన్ స్పిన్నర్ చాలా కాలంపాటు నిరీక్షించాడు. కానీ, నిరాశే మిగిలింది. దీంతో ఈ మధ్యే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఇదీ చూడండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
'నన్ను ఎందుకు తప్పించారో తెలియదు'.. భజ్జీ షాకింగ్ కామెంట్స్