Deepak Chahar, Suryakumar yadav Injury: శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా కీలక ప్లేయర్లు సిరీస్‌కు దూరమవుతున్నారు. ఇప్పటికే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ దూరమవ్వగా.. ఇప్పుడు దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్ కూడా అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడ్డ దీపక్.. ఇంకా కోలుకోలేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ చేతికి గాయం అయినట్లు వెల్లడించారు. దీంతో వీరిద్దరిని సిరీస్‌కు దూరం ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం.
''దీపక్ చాహర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. తిరిగి కోలుకునే వరకు జాతీయ క్రికెట్ అకాడమీలో ఉంటాడు.''
- బీసీసీఐ అధికారి
కాగా, ఇటీవలి కాలంలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిలకడగా రాణిస్తున్నాడు చాహర్. వెస్టిండీస్‌తో ఆదివారం కోల్‌కతాలో జరిగిన మూడో టీ-20 సందర్భంగా.. బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. అప్పుడే మైదానాన్ని వీడగా.. అతడి బౌలింగ్ కోటాను వెంకటేశ్ అయ్యర్ పూర్తిచేశాడు. శ్రీలంకతో 3 మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ఫిబ్రవరి 24న ప్రారంభం కానుంది.
ఐపీఎల్‌కు కూడా..!