టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోని యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం ఇంటివద్దే విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. తరచూ సామాజిక మాధ్యమాల్లో తనకు సంబంధించిన విషయాలు పంచుకునే ఇతడు.. తాజాగా ఓ ఫొటోను షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అతడికి ఏమైందని కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఫొటోలో నలుపు రంగు టీషర్ట్‌లో కనిపించిన గిల్.. 'ఏంజెల్స్‌తో ప్రేమలో పడకూడదు' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు అతడికి బ్రేకప్ అయ్యిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
గిల్ ప్రేయసి ఎవరు?
చాలాకాలంగా గిల్‌కు సచిన్ తెందూల్కర్ తనయ సారా తెందూల్కర్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు గుసగుసలు విపిస్తున్నాయి. చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపించారు. అలాగే సామాజిక మాధ్యమాల్లోనూ ఫొటోలతో సందడి చేశారు. తాజాగా ఈ పోస్ట్‌తో వీరిద్దరికీ బ్రేకప్ అయిందని అనుకుంటున్నారు నెటిజన్లు.
టీమ్ఇండియా తరఫున వన్డే, టెస్టులకు ప్రాతనిధ్యం వహించిన గిల్.. కొద్దికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు 8 టెస్టులాడిన ఇతడు 414 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ముఖ్యంగా గబ్బా టెస్టులో ఇతడు ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్ తరఫున టెస్టుల్లో రెగ్యులర్ ఓపెనర్‌గా మారిపోయాడు.