Gujarat Titans Squad: కెప్టెన్‌గా ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తానని.. వారికి అందుబాటులో ఉంటానని స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య చెప్పాడు. ఈనెల 26న ఆరంభం కానున్న ఐపీఎల్-15లో అరంగేట్ర జట్టు గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పాండ్య ఈ వ్యాఖ్యలు చేశాడు. "మైదానంలో దిగి చాలా రోజులైంది. అందుకే ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. కెప్టెన్‌గా పూర్తి సామర్థ్యంతో ఆడి గుజరాత్ టైటాన్స్‌ను గెలిపించేందుకు కృషి చేస్తా. ఆటగాళ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా. వారికి స్వేచ్ఛతో పాటు భద్రత ఇస్తా" అని హార్దిక్ పేర్కొన్నాడు.
'ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తా.. వాటిపైనే దృష్టి పెడతా' - గుజరాత్ టైటాన్స్ న్యూస్
gujarat titans captain: ప్రస్తుతం తాను 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్'లో ఉన్నానని, గుజరాత్ టైటాన్స్‌ను నడిపించడంపైనే దృష్టి పెట్టినట్లు హార్దిక్ పేర్కొన్నాడు. కెప్టెన్‌గా ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తానని.. వారికి అందుబాటులో ఉంటానని అన్నాడు.
తన నియంత్రణలో ఉన్న వాటిపైనే దృష్టి పెట్టానని.. పూర్తి ఫిట్‌నెస్ సాధించే దిశగా సాగుతున్నానని హార్దిక్ తెలిపాడు. "ఐపీఎల్‌లో సానుకూల దృక్పథంతో బరిలో దిగాలని భావిస్తున్నా. నా నియంత్రణలో ఉన్న వాటిపైనే దృష్టి పెట్టా. గుజరాత్ తరఫున సత్తా చాటితే భవిష్యత్ కూడా బాగుంటుంది" అని పాండ్య ఆశాభావం వ్యక్తం చేశాడు. ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించడం వల్లే అంతర్జాతీయ క్రికెట్ ఆడానని అందుకు వారికి కృతజ్ఞతలు అని హార్దిక్ అన్నాడు. పాండ్య.. ఇటీవలే జాతీయ క్రికెట్ అకాడమీలో యో-యో పరీక్షలో సఫలమయ్యాడు. ఐపీఎల్‌లో మార్చి 28న మరో అరంగేట్ర జట్టు లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌తో గుజరాత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
ఇదీ చదవండి:'ధోనీని క్లీన్‌బౌల్డ్ చేశా.. ఈసారి నా టార్గెట్ విరాట్ కోహ్లీ'