తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్‌ఇండియా ఓటమిపై 'గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు' సెటైర్లు - టీమ్​ఇండియాపై గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సెటైర్​

టీ20 వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్​లో ఇంగ్లాండ్‌ చేతిలో టీమ్‌ఇండియా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో మీమ్స్​తో ఓ రేంజ్​లో రచ్చ చేస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో నేనేం తక్కువంటూ 'గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు' కూడా భారత్‌ పరాజయంపై స్పందించింది.

Teamindia  guinniess world record
టీమ్‌ఇండియా ఓటమిపై 'గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు' సెటైర్లు

By

Published : Nov 12, 2022, 10:46 AM IST

టీ20 వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో టీమ్‌ఇండియా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో అభిమానులు తమదైన శైలిలో సోషల్​మీడియాలో ట్రోల్స్​ చేస్తున్నారు. రకరకాల మీమ్స్‌తో భారత్‌ జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేనేం తక్కువంటూ 'గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు' కూడా భారత్‌ పరాజయంపై స్పందించింది. "చరిత్రలో అతిసులువైన ఛేదన ఇదేనా?" అంటూ ట్విటర్‌ వేదికగా సెటైర్లు విసిరింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

భారత్-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా చిత్తుగా ఓడిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ చేతులెత్తేసింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ ఓపెనర్లు బట్లర్‌ (80 నాటౌట్‌), హేల్స్‌ (86 నాటౌట్‌) అవలీలగా కొట్టేశారు. కేవలం 16 ఓవర్లలోనే విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఫైనల్‌లో దాయాది పాకిస్థాన్‌తో పోటీపడతామని భావించిన భారత్‌ క్రికెట్‌ అభిమానులను ఈ పరాజయం తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:మీమ్స్​తో రచ్చ రచ్చ టీమిండియాను ఏకిపారేస్తున్న ఫ్యాన్స్

ABOUT THE AUTHOR

...view details