తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ, రోహిత్​, కోహ్లీ కాదు.. ఆ క్రికెటర్​ గురించి ఎక్కువ వెతికారట! - ప్రవీణ్​ తాంబే మోస్ట్ సెర్చ్​డ్​ క్రికెటర్​

స్టార్ క్రికెటర్స్​ ధోనీ, రోహిత్​, కోహ్లీ గురించి కాకుండా గూగుల్​లో ఆ క్రికెటర్​ గురించి ఎక్కువ వెతికారట. అతడెవరంటే

Google most searched cricketer is Pravin Tambe
ధోనీ, రోహిత్​, కోహ్లీ కాదు.. ఆ క్రికెటర్​ గురించి ఎక్కువ వెతికారట!

By

Published : Dec 16, 2022, 2:28 PM IST

మరో 15 రోజుల్లో 2022 ముగియబోతుంది. దీంతో ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా గూగుల్​లో ఎక్కువగా ఏం వెతికారు? ఎందుకు వెతికారు? ఎవరి గురించి ఎక్కువ సెర్చ్ చేశారు? వంటి విషయాలను గూగుల్​ లిస్ట్​ను విడుదల చేస్తుంది. అయితే ఇందులో ఎక్కువగా వెతికిన క్రీడాకారుడు ఎవరో మీకు తెలుసా! దాని గురించే ఈ కథనం..

సాధారణంగా ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేక వేరే దేశానికి చెందిన పాపులర్ ఆటగాళ్లు. గూగుల్​లో ఎక్కువగా వీరి గురించే సెర్స్​ చేస్తారు. ఇప్పుడు ధోనీ ఏం చేస్తున్నాడు? రోహిత్ భారత జట్టును ఎలా నడిపిస్తున్నాడు? మునుపటి ఫాం అందుకున్న కోహ్లీ ప్రస్తుతం ఎన్ని సెంచరీలు చేశాడు? ఇలాంటివి వెతికొచ్చని మనం అనుకుంటాం. కానీ ఈ సారి దీనికి భిన్నం. వీరెవరూ కాదు. ఇలాంటి ప్రశ్నలు లేనే లేవు. మరి గూగుల్​లో ఏ ఆటగాడి గురించి ఎక్కువ వెతికారో అనే అనుమానం వస్తుందా. అతడు మరెవరో కాదు ప్రవీణ్ తాంబే.

41 ఏళ్ల వయసులో ఐపీఎల్​లో అరంగేట్రం చేశాడు ప్రవీణ్​ తాంబే. ఇప్పటివరకు భారత జాతీయ జట్టుకు ఆడలేదు. అయినా సరే అతడి గురించే గూగుల్​లో ఎక్కువ శోధించారట. ఇతడి గురించి బాలీవుడ్​లో సినిమా కూడా వచ్చింది. హిందీ నటుడు శ్రేయస్ తల్పడే టైటిల్ రోల్ పోషించాడు. ఐపీఎల్​లో ఆడిన అతి పెద్ద వయస్కుడిగా తాంబే రికార్డు సృష్టించాడు. దీని వల్లే అతని గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపించారు.

ఇదీ చూడండి:టెస్టుల్లో ఎక్కువ రన్స్​ చేసిన ఇండియన్​ క్రికెటర్స్​ వీరే

ABOUT THE AUTHOR

...view details