మొదటిసారే 15 మంది.. 2007 టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై టీమ్‌ఇండియా విజయం సాధించింది. అయితే ఆ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ హిట్టర్ షాహిద్ అఫ్రిదిని ఇర్ఫాన్ పఠాన్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. అలాగే ఈ ప్రపంచకప్‌లోనే 15 గోల్డెన్ డక్‌లు చోటు చేసుకోవడం గమనార్హం. ఇలా మొదటి బంతికే దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ షాన్ పొలాక్, బంగ్లా మాజీ బ్యాటర్ నజిముద్దీన్ రెండేసిసార్లు ఔటయ్యారు. మిగతా బ్యాటర్లలో క్లార్క్ (ఆస్ట్రేలియా), అబ్దుర్ రజాక్ (పాకిస్థాన్), లూక్ రైట్ (ఇంగ్లాండ్), మస్కరెన్హాస్ (ఇంగ్లాండ్), ఓబుయా (జింబాబ్వే), బ్లైన్ (స్కాట్లాండ్), జేఎస్ పటేల్ (కివీస్), కాలింగ్‌వుడ్ (ఇంగ్లాండ్), మొర్తజా (బంగ్లాదేశ్), ఆలోక్ కపిల్ (బంగ్లాదేశ్), జయసూర్య (శ్రీలంక), దినేశ్ కార్తిక్ (భారత్) ‘సున్నా’ పరుగులకే పెవిలియన్‌కు చేరారు.
రికీ పాంటింగ్ కూడా.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. క్రీజ్‌లో కుదురుకుంటే ధాటిగా ఆడతాడు. అలాంటి బ్యాటర్ కూడా తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. ఈ ఫీట్ 2009 ప్రపంచకప్‌లో విండీస్ మీద జరిగింది. అలాగే స్కాట్లాండ్ బ్యాటర్లు రైన్ వాట్సన్, కొలిన్ స్మిత్ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరూ గోల్డెన్ డక్ కావడం విశేషం. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా దక్షిణాఫ్రికాపై తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. ఇక దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్‌లో జేపీ డుమినీ (సౌతాఫ్రికా), జెరోమీ టేలర్ (విండీస్) గోల్డెన్ డక్ అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్ గ్రేమీ స్వాన్, విండీస్ బ్యాటర్ సిమ్మన్స్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. నువాన్ కులశేఖర (శ్రీలంక), షాహిది అఫ్రిది (పాక్), కేల్ మిల్స్ (కివీస్), ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక), ఆండ్రూ బోధా (ఐర్లాండ్), ట్రెంట్ జాన్‌స్టన్ (ఐర్లాండ్), జయసూర్య (శ్రీలంక), జేవియర్ మార్షల్ (వెస్టిండీస్) గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేరారు.
ఒకే మ్యాచ్‌లో నలుగురు గోల్డెన్.. 2010 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా-పాక్ మ్యాచ్ సందర్భంగా నలుగురు బ్యాటర్లు గోల్డెన్ డక్ కావడం విశేషం. వీరిలో ఆసీస్‌కు చెందిన మిచెల్ జాన్సన్, స్టీవ్ స్మిత్, డిర్క్ నాన్నెస్ ఉండగా.. స్మిత్ రనౌట్ రూపంలో డైమండ్ డక్‌గాఈ పెవిలియన్ చేరాడు. ఇక పాక్ మాజీ ఓపెనర్ కమ్రాన్ అక్మల్ మొదటి బంతికే ఔటయ్యాడు. అదేవిధంగా జింబాబ్వే బ్యాటర్లు గ్రీమీ క్రీమెర్, ప్రాస్పర్ ఉత్సెయను తొలి బాల్‌కు కివీస్ బౌలర్ స్టైరిస్ ఔట్ చేశాడు.
భారత్ నుంచి మురళీ విజయ్ దక్షిణాఫ్రికాపై గోల్డెన్ డక్ అయ్యాడు. అఫ్గానిస్థాన్ మీద దక్షిణాఫ్రికా అప్పటి ఓపెనర్ లూట్స్ బోస్‌మన్ తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది రనౌట్ రూపంలో డైమండ్ డక్ జాబితాలోకి చేరాడు. మరో పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్ కివీస్ మీద ఈ చెత్త రికార్డును అందుకొన్నాడు. ఆసీస్ జట్టు మీద ఆఖర్లో బ్యాటింగ్‌కు దిగిన భారత బౌలర్ ఆశిశ్ నెహ్రా టైట్ బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. విండీస్ బ్యాటర్ రామ్‌నరేశ్ శర్వాన్, డేవిడ్ హస్సీ (ఆసీస్) కూడా ఈ జాబితాలో ఉన్నారు.
కాస్త తక్కువగా.. అంతకుముందు మూడు ప్రపంచకప్‌లను పోలిస్తే 2012లో గోల్డెన్ డక్‌లు తక్కువగానే నమోదయ్యాయి. అయితే పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ షాహిద్ అఫ్రిది రెండుసార్లు తొలి బంతికే పెవిలియన్‌కు చేరడం విశేషం. 2012 ప్రపంచకప్‌లో 8 మంది మాత్రమే గోల్డెన్ డక్‌లుగా ఔటయ్యారు. వీరిలో షఫికుల్లా (బంగ్లాదేశ్), విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ (ఐర్లాండ్), బ్రెండన్ టేలర్ (జింబాబ్వే), చిగుంబర (జింబాబ్వే), లూక్ రైట్ (ఇంగ్లాండ్), షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్), ప్యాట్ కమిన్స్ (ఆసీస్), ఆండ్రూ రస్సెల్ (విండీస్) ఉన్నారు. వీరిలో జింబాబ్వే ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. టోర్నీ చివరి దశకు వచ్చినప్పుడు కీలక బ్యాటర్లు గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేరారు.