దేశం కరోనా సంక్షోభంలో చిక్కుకున్నప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్న టీమ్ఇండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి సురక్షితంగా ఉండాలని సూచనలిస్తున్నాడు. సూచనలకే పరిమితం కాకుండా ఎన్95 మాస్క్‌లు కొనుగోలు చేసే స్థోమత లేనివారికి ఉచితంగా పంపిణీ చేస్తానని ఈ మధ్యే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాడు.
దేశంలో కొవిడ్ విజృంభణను దృష్టిలో ఉంచుకుని అశ్విన్ తాజాగా భావోద్వేగపూరితమైన సందేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు.'ఈ సంక్షోభమంతా ముగిసిన తర్వాత నన్ను లేపండి. ఇంకా ఎంతమంది ప్రజలు చనిపోవాలి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. దయచేసి మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించకపోవడం త్వరలో నేరంగా మారవచ్చు. దేవుడా కాస్తా దయ చూపించు' అని ట్వీట్ చేశాడు.