తెలంగాణ

telangana

ETV Bharat / sports

Maxwell Record: మ్యాక్స్​వెల్​ విధ్వంసం.. 41 బంతుల్లో సెంచరీ - మ్యాక్స్​వెల్​

Maxwell Record: ఆస్ట్రేలియా స్టార్​ బ్యాటర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​.. బిగ్​బాష్​ లీగ్​లో అదరగొట్టాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు.

Maxwell Record
Maxwell Record

By

Published : Jan 19, 2022, 6:48 PM IST

Maxwell Record: బిగ్​బాష్​ లీగ్​లో గ్లెన్​ మ్యాక్స్​వెల్​ విధ్వంసం సృష్టించాడు. హాబర్ట్​ హరికేన్స్​తో జరిగిన మ్యాచ్​లో మెల్​బోర్న్ స్టార్స్​ కెప్టెన్ మ్యాక్స్​వెల్​ సెంచరీతో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. బౌండరీలు బాదుతూ హరికేన్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. 64 బంతుల్లో 154 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్​లో 24 ఫోర్లు, నాలుగు సిక్స్​లు బాదాడు. ఈ లీగ్​ చరిత్రలోనే వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

మరోవైపు మ్యాక్స్​వెల్​కు తోడు స్టోయినిస్​ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో మెల్​బోర్న్​ రెండు వికెట్ల నష్టానికి 273 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించింది. ఇప్పటివరకు బిగ్​బాష్​లీగ్​లో ఇదే అత్యధిక స్కోరు. హరికేన్స్​ బౌలర్లు జోష్​ఖాన్​, థామ్సన్​ చేరో వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హరికేన్స్​ చతికలపడింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 167 పరుగులే సాధించి ఓటమి పాలైంది.

ఇదీ చూడండి:శతకాలతో చెలరేగిన డస్సెన్, బవుమా​.. భారత్​కు భారీ లక్ష్యం

ABOUT THE AUTHOR

...view details