టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Maxwell on Virat Kohli), దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Maxwell on RCB). తాను తిరిగి ఫామ్‌లోకి రావడానికి కారణం విరాట్, డివిలియర్సే అని అన్నాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున వారిద్దరితో కలిసి ఆడటం వల్ల తాను '10 అడుగుల ఎత్తు' ఉన్నట్లు ఫీల్ అవుతున్నానని తెలిపాడు.
"ప్రతి రోజు ఓ కొత్త విషయం నేర్చుకోవాలని నేను పరితపిస్తాను. విరాట్, డివిలియర్స్ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో గమనిస్తుండేవాడిని. ఐపీఎల్‌కు కృతజ్ఞత చెప్పుకోవాలి. ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్ల నుంచి చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఐపీఎల్ కల్పిస్తుంది."
-మ్యాక్స్‌వెల్, ఆసీస్ ఆల్‌రౌండర్.