గ్రాస్ ఐలెట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో ఆతిథ్య వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల పొట్టి సిరీస్ను 3-0తో గెలుచుకుంది కరీబియన్ జట్టు. సిరీస్లో నామమాత్రమైన తదుపరి మ్యాచ్ గురువారం జరగనుంది.
తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (31 బంతుల్లో 30 పరుగులు), హెన్రిక్స్(29 బంతుల్లో 33 పరుగులు) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. వాల్ష్ 2, బ్రావో, అలెన్, మెక్కాయ్ చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం లక్ష్య ఛేదనలో పూరన్ సేన దూకుడుగా ఆడింది. కేవలం 14.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(38 బంతుల్లో 67 పరుగులు) విధ్వంసం సృష్టించాడు. అతనికి సారథి నికోలస్ పూరన్(27 బంతుల్లో 32 పరుగులు) అండగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో మెరిడిత్ 3, స్టార్క్ ఒక వికెట్ తీసుకున్నారు.
గేల్ రికార్డు..