క్రికెట్లో తొలి బంతికి సిక్సు కొట్టడమనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. టెస్టులో ఇలా జరగడం ఇంకా అరుదు. అయితే ఈ ఫార్మాట్లో తొలి బంతికి సిక్సు కొట్టి గేల్ సృష్టించిన రికార్డును యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్ సాధించి, అతడి సరసన చేరాడు. ఈ ఘనత సాధించిన టీమ్ఇండియా తొలి ఆటగాడిగా నిలిచాడు.
గేల్.. 2012లో బంగ్లాదేశ్‌పై ఈ మార్క్‌ను అందుకుంటే, పంత్.. 2018 జులైలో ఇంగ్లాండ్‌పై ఈ ఫీట్ సాధించాడు.