ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో(ICC T20 world Cup 2021) పాల్గొనే భారత జట్టును(T20 World Cup Indian Squad) బుధవారం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అధ్యక్షుడు ఛైర్మన్ చేతన్ శర్మ ప్రకటించారు. ఈ టోర్నీ కోసం 15 మందితో ఎంపిక చేసిన జట్టుకు మెంటార్‌గా ధోనీని(Dhoni Mentor) నియమించారు. ఇదే విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా వెల్లడించారు. అయితే ఈ మెగా ఈవెంట్లో ధోనీని మెంటార్‌గా నియమించడం వెనుక ఓ కారణం ఉందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(Gambhir Dhoni) అంటున్నాడు.
"ఇందులో ధోనీ పాత్ర ఎంతో తెలియాల్సి ఉంది. ఇప్పటికే జట్టుకు ప్రధాన కోచ్, అసిస్టెంట్ కోచ్, బౌలింగ్ కోచ్ ఉన్నారు. కాబట్టి కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీలు కాకుండా.. కొత్తగా అతడికి ఏదైనా ప్రత్యేకత ఉండాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే టీ20ల్లో టీమ్ఇండియా విజయవంతంగా కొనసాగుతోంది. కానీ, కష్టాల్లో లేదు. ఒకవేళ పొట్టి ఫార్మాట్లో భారత్ జట్టుకు నిలకడ లేకపోతే బయట నుంచి ఎవర్ని అయినా తీసుకోవచ్చు."
- గౌతమ్ గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్