Sourav Ganguly Covid: బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి కరోనా - saurav ganguly news
09:43 December 28
గంగూలీకి కరోనా పాజిటివ్
Sourav Ganguly Covid: టీమ్ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొవిడ్ బారినపడ్డాడు. సోమవారం సాయంత్రం గంగూలీ ఆసుపత్రిలో చేరినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
స్వల్ప కొవిడ్ లక్షణాలతో.. కోల్కతాలోని వుడ్లాండ్స్ ఆసుపత్రిలో గంగూలీ చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం దాదా ఆరోగ్యంగానే ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
గతంలో యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేయించుకున్నాడు సౌరవ్ గంగూలీ. ఇటీవలే దాదా సోదరుడు, తల్లి కొవిడ్ బారినపడి కోలుకున్నారు.