Ganguly corona: టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లుగా గుర్తించామని వుడ్‌లాండ్స్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Ganguly corona: దాదాకు డెల్టా ప్లస్ వేరియంట్ పాజిటివ్ - దాదాకు పాజిటివ్
Ganguly corona: కరోనా చికిత్స తీసుకుని డిశార్చి అయిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి కొవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు తెలిపారు వైద్యులు. అయితే వైరస్ లక్షణాలు స్వలంగా ఉండటం వల్ల అతడు ఇంట్లోనే ఇసోలేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
గంగూలీ
గత వారం కరోనా బారిన పడిన గంగూలీ కోల్‌కతాలోని వుడ్‌లాండ్స్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆయనకు ఒమిక్రాన్ పరీక్షలు నిర్వహించగా.. అందులో నెగెటివ్ రావడం వల్ల డిశ్ఛార్జి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు డెల్టా ప్లస్ పాజిటివ్‌గా గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం ఆయనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండటంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని సూచించామన్నారు.
ఇదీ చూడండి: కరోనా నుంచి కోలుకున్న గంగూలీ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
Last Updated : Jan 2, 2022, 12:09 PM IST