BCCI Ganguly Resign: సోషల్‌మీడియాలో చాలా సార్లు అసత్య ప్రచారాలు చేయడం చూస్తూనే ఉంటాం. రీసెంట్గా కామన్వెల్త్‌తో 100 మీటర్ల స్ప్రింట్‌లో భారత అథ్లెట్ హిమదాస్ స్వర్ణం దక్కించుకుందంటూ ఫేక్ న్యూస్ వైరల్ అయింది. అయితే తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధపు ప్రచారం జోరుగా సాగింది. అదేంటంటే బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ రాజీనామా చేశారని, అతని స్థానంలో ప్రస్తుత కార్యదర్శి జైషా కొత్త అధ్యక్షునిగా ఎన్నికవ్వనున్నారంటూ కొందరు ఆకతాయిలు పోస్ట్ వైరల్ చేస్తున్నారు. అది కూడా బీసీసీఐ పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్‌తో. ఇది చూసిన క్రికెట్ అభిమానులు నిజమనుకుని దాన్ని మరింత వైరల్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి బీసీసీఐ అధికారిక ట్విటర్ నుంచి గంగూలీ రాజీనామా చేస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. దీంతో గంగూలీ రాజీనామా అనేది ఫేక్ అని తేలిపోయింది.
కాగా, విరాట్ కోహ్లీని వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సెలక్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్న విషయంలోనూ పరోక్షంగా దాదా హస్తం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. విభేదాల కారణంగా గంగూలీ.. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించారని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి.