భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు గంగూలీకి(Sourav Ganguly News) కీలక బాధ్యతను అప్పగించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC News). ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో తొమ్మిదేళ్ల పాటు ఛైర్మన్‌గా పనిచేసిన దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే(Anil Kumble ICC) స్థానాన్ని దాదా భర్తీ చేయనున్నాడు.
"ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీని నియమించడం ఆనందంగా ఉంది. బ్యాటర్‌గా, క్రికెట్ పాలకుడిగా గంగూలీకి ఉన్న అనుభవం క్రికెట్లో ఉత్తమ నిర్ణయాలు తీసుకునేలా దోహదపడాలని ఆశిస్తున్నాను. గత తొమ్మిదేళ్లుగా ఈ కమిటీ ఛైర్మన్‌గా సేవలిందించిన అనిల్ కుంబ్లేకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. డీఆర్ఎస్ అమలు సహా పలు నిర్ణయాల్లో కుంబ్లే పాత్ర కీలకం" అని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే చెప్పారు.
అఫ్గాన్ వర్కింగ్ గ్రూప్..
అఫ్గానిస్థాన్‌లో(Afghanistan Cricket News) తాలిబన్ల పాలన నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్ క్రికెట్ బోర్డు కార్యాచరణను సమీక్షించేందుకు ఓ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఇమ్రాన్ ఖ్వాజా(ఛైర్మన్), రాస్ మెక్‌కలమ్, లాసన్ నైడో, రమీజ్ రాజాను గ్రూప్ సభ్యులుగా నియమించింది. మరికొన్ని నెలల్లో ఈ గ్రూప్.. నివేదికను సమర్పించనుంది. అఫ్గాన్ పురుషుల, మహిళల జట్టును ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది ఐసీసీ.