తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రంజీ ట్రోఫీ నిర్వహణ తప్పనిసరి.. కానీ..'

Ganguly on Ranji Trophy: కరోనా కారణంగా వాయిదా పడిన దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ నిర్వహణపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని అన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఈ మేరకు కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించాడు.

ganguly
గంగూలీ

By

Published : Jan 6, 2022, 8:46 PM IST

కొవిడ్​ కారణంగా దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీని నిలిపివేస్తూ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). అయితే.. ఈ టోర్నీని తిరిగి ప్రారంభించేందుకు శాయశక్తులా కృషిచేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.

"కొవిడ్​ వ్యాప్తి దారుణంగా పెరుగుతోంది. చాలా జట్లలో ఆటగాళ్లకు, సిబ్బందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఆటగాళ్లకు, అధికారులకు, మ్యాచ్​ నిర్వాహకులకు ఇది ఇబ్బందికరమైన అంశం. ఈ నేపథ్యంలో టోర్నీ వాయిదా వేయాల్సి వచ్చింది."

--సౌరవ్ గంగూలీ, బీసీసీఐ.

కొవిడ్​ పరిస్థితులు అదుపులోకి వచ్చాక ఈ టోర్నీ నిర్వహణకు బీసీసీఐ శక్తిమేర ప్రయత్నిస్తుందని గంగూలీ చెప్పాడు. రంజీ ట్రోఫీ కోసం మిగతా టోర్నీలు వాయిదా పడతాయని పేర్కొన్నాడు. త్వరలోనే బీసీసీఐ మరో ప్రణాళిక సిద్ధం చేస్తుందని వెల్లడించాడు. పలు టీమ్​ల అధ్యక్షులకు, సెక్రటరీలకు పంపిన మెయిల్​లో ఈ అంశాలను ప్రస్తావించాడు గంగూలీ.

జనవరి 13 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, పలువురు ఆటగాళ్లు, సిబ్బంది కొవిడ్​ బారినపడిన కారణంగా టోర్నీని వాయిదా వేసింది బీసీసీఐ. బంగాల్​ జట్టులో చాలా మందికి వైరస్​ సోకగా, ముంబయి ఆల్​రౌండర్ శివమ్ దూబే కూడా కొవిడ్ బారినపడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details