టీ20 ప్రపంచకప్(T20 World Cup) కోసం ఎంపిక చేసిన భారత జట్టుకు మాజీ సారథి ఎంఎస్ ధోనీని మెంటార్‌గా(Dhoni Mentor) నియమించడానికి కారణం తెలిపాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Ganguly News). 2013 తర్వాత టీమ్ఇండియా ఐసీసీ ట్రోఫీ సొంతం చేసుకోలేదని అందుకే ధోనీకి ఆ బాధ్యతలు అప్పజెప్పినట్లు పేర్కొన్నాడు.
"ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు సాయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. టీ20 ఫార్మాట్లో.. భారత జట్టు తరఫున, చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ధోనీకి మంచి రికార్డులున్నాయి. బాగా ఆలోచించి, పలు మార్లు చర్చించాకే ధోనిని మెంటార్‌గా నియమించాలనే నిర్ణయం తీసుకున్నాం. టీమ్ఇండియా 2013 నుంచి ఇప్పటివరకు ఐసీసీ ట్రోఫీ గెలవలేదు."
--సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.
ఆస్ట్రేలియా జట్టుకు మాజీ సారథి స్టీవ్ వా మెంటార్‌గా వ్యవహరించడం వల్లే.. 2019 యాషెస్ సిరీస్ ఆసీస్ సొంతమైందని గంగూలీ గుర్తుచేశాడు. ఈ నేపథ్యంలో ధోనీ మెంటార్‌గా(Team India Mentor T20 World Cup) వ్యవహరించడం టీమ్ఇండియాకు మంచిదని అభిప్రాయపడ్డాడు.