టీమ్‌ఇండియా సారథిగా తనదైన ముద్ర వేసిన గంగూలీ (Ganguly News).. బీసీసీఐ అధ్యక్షుడిగానూ తన మార్క్ చూపిస్తున్నాడు. తాను సారథిగా ఉన్నప్పుడు యువ క్రికెటర్లకు పెద్దపీట వేసి భారత జట్టు భవిష్యత్తుకు బాటలు వేసిన దాదా.. ఇప్పుడు టీమ్ఇండియాను మరోసారి విశ్వ విజేతను చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాడు. పదవిపై అంతగా ఆసక్తి లేని.. మాజీ దిగ్గజ క్రికెటర్లను కీలక బాధ్యతలు చేపట్టేలా ఒప్పించాడు. రానున్న మూడేళ్లల్లో జరిగే ఐసీసీ టోర్నీలకు పటిష్ఠ జట్టును తయారు చేసే వ్యూహాల్లో ముగినిపోయాడు.
రాబోయే రెండు, మూడేళ్లు టీమ్ఇండియాకు చాలా కీలకం. ఈ సమయంలో.. మరో టీ20 ప్రపంచకప్‌తో పాటు, టెస్టు ఛాంపియన్‌షిప్, వన్డే ప్రపంచకప్ జరగనున్నాయి. ఐసీసీ టోర్నీల్లో వరుసగా విఫలమవుతున్న భారత జట్టును.. ఈ టోర్నీల నాటికి మరింత పటిష్టంగా మార్చాలని బీసీసీఐ భావిస్తోంది. అందులో భాగంగానే మాజీ దిగ్గజ క్రికెటర్లకు.. టీమ్ఇండియాలో కీలక బాధ్యతలు అప్పగిస్తోంది.
ద్రవిడ్ అంగీకరించేలా..
టీమ్‌ఇండియా సారథిగా తన మార్క్‌ను చాటుకున్న గంగూలీ (Sourav Ganguly News).. బీసీసీఐ అధ్యక్షుడిగానూ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. భారత జట్టు ప్రధాన కోచ్ పదవి చేపట్టేందుకు అంగీకరించని రాహుల్ ద్రవిడ్‌ను.. ఆ బాధ్యతలు స్వీకరించేలా గంగూలీ (Ganguly Dravid) ఒప్పించాడు. అండర్ 19, ఇండియా ఏ జట్ల కోచ్‌గా సత్ఫలితాలు రాబట్టిన ద్రవిడ్.. ఎంతోమంది యువ క్రీడాకారులను జాతీయ జట్టుకు అందించాడు. టీమ్‌ఇండియా హెడ్ కోచ్ పదవిని ద్రవిడ్ (Dravid Coach News) చేపట్టడం వల్ల భారత జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టమై ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటుతుందని మాజీలు అంచనా వేస్తున్నారు.
ఎన్సీఏ బాధ్యతలు లక్ష్మణ్‌కు..