తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​-శ్రీలంక పింక్​ బాల్​ టెస్టు త్వరలో.. గంగూలీ క్లారిటీ

Pink Ball Test: భారత్-​ శ్రీలంక మధ్య బెంగళూరు వెదికగా త్వరలోనే పింక్​ బాల్​ టెస్టు జరగనుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పష్టం చేశారు. శ్రీలంకతో సిరీస్​పై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.

pink ball test
పింక్​ బాల్​ టెస్ట

By

Published : Feb 3, 2022, 6:06 PM IST

Pink Ball Test: భారత్​-శ్రీలంక మధ్య త్వరలోనే పింక్​ బాల్​ టెస్టును నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు​​ గంగూలీ వెల్లడించారు. భారత్​లో శ్రీలంక పర్యటనలో భాగంగా బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్​ జరగనున్నట్లు చెప్పారు. అయితే మ్యాచ్​ తేదీపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో శ్రీలంకతో సిరీస్​ ఉంటుందని గంగూలీ పేర్కొన్నారు.

కేవలం పింక్​ బాల్​ టెస్టుకు మాత్రమే వేదిక ఖరారైందని.. మిగతా మ్యాచ్​లు ఎక్కడ నిర్వహించాలో అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గంగూలీ స్పష్టం చేశారు.

భారత్​ పింక్​ బాల్​ టెస్టుకు ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. 2019 నవంబరులో కోల్​కతా వేదికగా బంగ్లాదేశ్​తో తొలి పింక్​బాల్​ టెస్టు జరిగింది. గతేడాది ఫిబ్రవరిలో అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో రెండో పింక్​బాల్​ టెస్టును ఆడింది టీమ్​ఇండియా.

విండీస్​ పర్యటన పూర్తవగానే..

ఈనెల 20 నాటికి వెస్టిండీస్​తో టీమ్​ఇండియా టీ20 సిరీస్​ పూర్తిచేసుకోగానే భారత్​.. శ్రీలంకతో సిరీస్​కు సన్నద్ధమవుతుందని గంగూలీ చెప్పారు. లంకతో టీమ్​ఇండియా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి :IND VS WI: భారత్​-వెస్టిండీస్​ వన్డే సిరీస్​ వాయిదా?

ABOUT THE AUTHOR

...view details