తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 WorldCup:టీమ్​ఇండియా ప్రదర్శనపై దాదా కీలక వ్యాఖ్యలు - టీమ్​ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్​

టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా ప్రదర్శనపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ఏమన్నాడంటే..

Ganguly comments on teamindia performance
టీమ్​ఇండియా ప్రదర్శనపై దాదా కీలక వ్యాఖ్యలు

By

Published : Nov 2, 2022, 3:52 PM IST

టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండు విజయాలు సాధించి భారత అభిమానుల్లో జోష్‌ నింపిన రోహిత్‌ సేన.. మూడో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే.. టీమ్‌ ఇండియా సెమీస్‌ బెర్త్‌ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండేది కాదు. దీంతో భారత్‌కు తదుపరి మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు బంగ్లాదేశ్​తో మ్యాచ్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ప్రదర్శనపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌ కచ్చితంగా ఫైనల్‌ చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్‌ సేన ఆటతీరును మెచ్చుకున్నాడు.

బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్ వార్షిక సమావేశంలో గంగూలీ మాట్లాడుతూ.. గ్రూప్‌ 2లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న భారత్‌ సెమీస్‌ పోరులోకి సునాయాసంగా చేరుతుందని విశ్వాసం ప్రకటించాడు. 'ఇప్పటి వరకూ భారత్‌ ఒక్క మ్యాచ్‌ మాత్రమే కోల్పోయింది. అందరూ బాగా ఆడుతున్నారు.. కచ్చితంగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. రోహిత్‌ సేన ఫైనల్‌ కూడా చేరుతుందని ఆశిస్తున్నాను. భారత్‌ సెమీస్‌కు అర్హత సాధిస్తే.. చివరి రెండు మ్యాచ్‌లు ఆడుతుంది' అంటూ దాదా పేర్కొన్నాడు.

కాగా, ప్రస్తుతం బంగ్లాదేశ్​తో జరుగుతున్న మ్యాచ్​లో టీమ్​ఇండియా విజయం సాధిస్తే.. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోవడంతోపాటు.. సెమీస్‌లో బెర్తును ఖాయం చేసుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:టీ20ల్లో వరల్డ్​ నెం.1గా సూర్య కుమార్ యాదవ్​.. ప్రపంచకప్​లో కోహ్లీ అద్భుత ఘనత

ABOUT THE AUTHOR

...view details