తెలంగాణ

telangana

ETV Bharat / sports

అవన్నీ ఊహాగానాలే, వాటిని నమ్మొద్దంటున్న దాదా - గంగూలీ ఐసీసీ చీఫ్​

ICC New Chairman Ganguly ఐసీసీ కొత్త ఛైర్మన్​గా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ఎంపిక చేయబోతున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయమై దాదా స్పందించాడు. ఏమన్నాడంటే

Ganguly ICC Chief
ఐసీసీ చీఫ్​గా దాదా

By

Published : Aug 16, 2022, 12:06 PM IST

Updated : Aug 16, 2022, 12:55 PM IST

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. త్వరలోనే ప్రపంచ క్రికెట్​కు బాస్​ కాబోతున్నాడా? ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నాడా? అంటే అవుననే సమాధానం భారత క్రికెట్​లో కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది.

అయితే తాజాగా దీనిపై దాదా స్పందించాడు. "ఇవన్నీ ఊహాగానాలు. ఎవరికి నచ్చింది వాళ్లు రాసుకుంటున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఐసీసీ చీఫ్ పదవి అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా ఆ రేసులో నేను లేను. నా చేతుల్లో ఏమీ లేదు. బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయమే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుంది" అని స్పష్టం చేశాడు.

కాగా, ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్​ గ్రెగ్​ బార్ల్కే(న్యూజిలాండ్​) పదవీకాలం.. ఈ ఏడాది నవంబరుతో ముగియనుండటం వల్ల ఆ పదవి ఎవరిని వర్తిస్తుందోనని క్రికెట్​ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గతంలో ఈ పదవిలో నలుగురు భారతీయులు పనిచేశారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్​ దాల్మియా, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ మనోహర్‌ ఐసీసీ చైర్మన్‌ హోదాలో పని చేశారు.

ఇదీ చూడండి: అఖిల భారత ఫుట్​బాల్​ సమాఖ్యను సస్పెండ్​ చేసిన ఫిఫా

Last Updated : Aug 16, 2022, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details