భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. గతంలో తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు మీడియా నిశిత పరిశీలన నుంచి ఎలా తప్పించుకొనేదీ వెల్లడించాడు. 'ది రణ్‌వీర్ షో'లో మెరిసిన అతడు ఈ విషయాన్ని చెప్పాడు. దాదాపు 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో గంగూలీ చాలాసార్లు మీడియాలో పతాకశీర్షికగా మారాడు. ఫామ్ కోల్పోవడం, కెప్టెన్సీలో విఫలం కావడం, జట్టులో నుంచి బయటకు వెళ్లడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిపై గంగూలీ మాట్లాడుతూ.. టీమ్‌ఇండియాలోని ప్రతి ఆటగాడిని మీడియా నిరంతరం గమనిస్తూనే ఉంటుందని పేర్కొన్నాడు.
క్రికెటర్లకు దాదా సూచన.. దానికి దూరంగా ఉండాలంటూ.. - ganguly advice to cricketers
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కెరీర్లో ఫామ్ కోల్పోవడం, కెప్టెన్సీలో విఫలం కావడం, జట్టులో నుంచి బయటకు వెళ్లడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే దీనిపై మాట్లాడాడు దాదా. దీంతో పాటే క్రికెటర్లకు ఓ సూచన చేశాడు. ఏంటంటే.
"ప్రతి ఒక్కరిని మీడియా స్కానింగ్ చేసేస్తుంది. ఆయా సమయాల్లో పేర్లు మాత్రమే మారుతుంటాయి. అయితే నాపై వచ్చిన వాటిల్లో సగం వార్తలు నాకు తెలియవు. ఎందుకంటే నేను వాటిని అసలు చదవను. ఏదైనా హోటల్‌కు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బందికి చెప్పే మొదటి విషయం.. పొద్దున్నే నా రూమ్ డోర్ వద్ద ఎలాంటి పేపర్‌ను ఉంచొద్దు. అయితే ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ఎక్కువైపోయింది. మీ కంప్యూటర్‌లోనే కాకుండా మీ చేతిలోకే (ఫోన్) వచ్చేసింది. అయితే క్రికెటర్లు సోషల్ మీడియా నుంచి తప్పించుకోవడానికి ఓ మార్గం కనుక్కుంటారని ఆశిస్తున్నా" అని గంగూలీ వెల్లడించాడు. ఇటీవల విరాట్ కోహ్లీ తన ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో చర్చంతా కోహ్లీ మీదనే సాగింది. అయితే దాదాపు మూడేళ్ల తర్వాత విరాట్ సెంచరీ కొట్టి.. అలాంటి చర్చకు ముగింపు పలికాడు.
ఇదీ చూడండి: యూఎస్ ఓపెన్ విజేతగా అల్కరాజ్.. నెం.1 ర్యాంకు కైవసం.. నాదల్ రికార్డు సమం