తెలంగాణ

telangana

ETV Bharat / sports

లఖ్​నవూకు గంభీర్​ గుడ్​బై - మళ్లీ కోల్​కతాతో జర్నీ స్టార్ట్ - Guatam Gambhir IPL Career

Gambhir Quits LSG : టీమ్ఇండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్.. లఖ్​నవూ ఫ్రాంచైజీ నుంచి వైదొలిగాడు. అతడు మళ్లీ కోల్​కతా ఫ్రాంచైజీతో చేరనున్నాడు.

gambhir quits lsg
gambhir quits lsg

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 1:21 PM IST

Updated : Nov 22, 2023, 2:30 PM IST

Gambhir Quits LSG : టీమ్ఇండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్.. లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ ఫ్రాంచైజీకి గుడ్​బై చెప్పాడు. గత రెండు సీజన్​లలో ఎల్​ఎస్​జీ జట్టుకు మెంటార్​గా ఉన్న గంభీర్.. తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతడు మళ్లీ కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టుతో చేరనున్నాడు. 2024 ఐపీఎల్​లో కేకేఆర్​కు గంభీర్ సేవలందిచనున్నాడు. ఈ విషయాన్ని గంభీర్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. కాగా, గంభీర్‌ మార్గనిర్దేశంలో లఖ్‌నవూ 2022లో ఫైనల్‌కు చేరగా.. 2023లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

"లఖ్​నవూ సూపర్ జెయింట్స్‌తో నా ప్రయాణం ముగిసిందని ప్రకటిస్తున్నాను. ఈ జర్నీని చిరస్మరణీయం చేసిన ఆటగాళ్లు, కోచ్​లు, సపోర్టింగ్‌ స్టాఫ్, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు సపోర్ట్​గా ఉన్న ఫ్రాంఛైజీ యజమాని డా.సంజీవ్ గోయెంకాకు ప్రత్యేక ధన్యవాదాలు. మున్ముందు జట్టు అద్భుత విజయాలు నమోదు చేస్తుందని, ప్రతీ లఖ్​నవూ అభిమాని గర్వపడేలా చేస్తుందని అనుకుంటున్నా. ఆల్​ ది బెస్ట్ ఎస్​ఎస్​జీ" అని ట్విట్టర్​లో రాసుకొచ్చాడు. కాగా, గంభీర్‌ మార్గనిర్దేశంలో లఖ్‌నవూ 2022లో ఫైనల్‌కు చేరగా.. 2023లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

Guatam Gambhir IPL Career : గంభీర్ ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్ ( అప్పటి దిల్లీ డేర్ డెవిల్స్), కోల్​కతా నైట్​రైడర్స్​ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అతడి నేతృత్వంలో కోల్​కతా.. 2012, 2014లో ఛాంపియన్​గా నిలిచింది. ఐపీఎల్​లో గంభీర్ 154 మ్యాచ్​ల్లో 4217 పరుగులు చేశాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గంభీర్.. కోల్​కతాకు పలు సీజన్​లలో మెంటార్​గా వ్యవహరించాడు. గత రెండేళ్ల కింద ఎల్​ఎస్​జీ ఫ్రాంచైజీతో చేరిన విషయం తెలిసిందే.

Lucknow Super Giants Coach: ఇక ఇటీవల లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​.. ఎస్​. శ్రీరామ్​ను కొత్త అసిస్టెంట్​ కోచ్​గా నియమించుకుంది. 2024 ఐపీఎల్​లో లఖ్​నవూ హెడ్ కోచ్​ జస్టిన్ లాంగర్​తో కలిసి శ్రీరామ్ పనిచేయనున్నారు. వీరిద్దరూ గతంలో ఆస్ట్రేలియా జట్టుకు కలిసి పనిచేశారు.

IPL 2024 : బాంగర్​ పోయే.. అండీ వచ్చే.. RCBకి కొత్త కోచ్​.. ఈ సారైనా కప్పు కొట్టేనా?

కొత్త కోచ్​ వేటలో సన్​రైజర్స్​.. బ్రియన్​ లారాకు బైబై.. అతడిపై ఆసక్తి!

Last Updated : Nov 22, 2023, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details