Gambhir comments on dhoni: ధోనీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ధోనీ అంటే తనకు ఇష్టముండదనే పుకార్లను కొట్టిపారేశాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన గంభీర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనీ.. మాజీ సారథి అంటే తనకెంతో గౌరవమని చెప్పాడు.
'అవన్నీ పుకార్లు మాత్రమే. ధోనీ అంటే నాకు అమితమైన గౌరవం. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇదివరకే ఈ విషయాన్ని చెప్పాను. మళ్లీ చెబుతున్నా. ఎక్కడైనా ఈ విషయాన్ని చెప్పగలను. అతడికి ఏ అవసరం వచ్చినా ముందుంటాను. ధోనీకి అలాంటి పరిస్థితి రాదు. కానీ, వస్తే అండగా ఉంటా. అతడు టీమ్‌ఇండియాకు చేసిన సేవలే అందుకు కారణం. మా మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అయితే.. మా మధ్య ఎలాంటి వివాదాలు లేవు. ఇంకో విషయం.. ధోనీ సారథ్యంలో నేనే ఎక్కువకాలం వైస్‌కెప్టెన్‌గా ఉన్నా. ఐపీఎల్‌లో ఆడినప్పుడు మాత్రమే మైదానంలో ప్రత్యర్థుల్లా ఉన్నాం'