తెలంగాణ

telangana

ETV Bharat / sports

Virat Kohli: ధావన్ స్టైల్​లో కోహ్లీ.. నవ్వులు పూయిస్తున్న వీడియో - ధావన్​పై కోహ్లీ వీడియో

సీనియర్ బ్యాట్స్​మన్​ శిఖర్‌ ధావన్‌ను ఆటపట్టించాడు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ(Virat Kohli). ధావన్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను(Shikhar Dhawan Batting Style) అనుకరిస్తూ ఆడాడు. దానికి సంబంధించిన వీడియోను పోస్ట్​ చేయగా అది కాస్త వైరల్​గా మారింది.

Virat Kohli ash dhawan
ధావన్​లా కోహ్లీ

By

Published : Oct 18, 2021, 4:14 PM IST

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ(Virat Kohli).. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ను ఆటపట్టించాడు. అందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో పోస్టుచేశాడు. ధావన్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను(Shikhar Dhawan Batting Style) అనుకరిస్తూ వీడియో తీసిన కోహ్లీ(Virat Kohli) దాన్ని అభిమానులతో పంచుకొని నవ్వులు పూయించాడు. ప్రస్తుతం జట్టులో ధావన్‌ తన స్థానం కోల్పోయాడు. ఈ నేపథ్యంలోనే అతడి బ్యాటింగ్‌ స్టైల్‌(Shikhar Dhawan Batting Style) ఎలా ఉంటుందో చూపిస్తూ సరదాగా నవ్వులు పూయించేందుకు ఇలా చేసినట్లు కోహ్లీ చెప్పాడు.

గబ్బర్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను తాను పలుమార్లు గమనించానని, అది సరదాగా ఉంటుందనే ఈ వీడియో చేసినట్లు కోహ్లీ(Shikhar Dhawan Batting Style) వివరించాడు. ఇక ఆ వీడియో చూసిన అభిమానులు సరదాగా ఉందంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ధావన్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు తన భుజాల దగ్గర జెర్సీని ఎలా సర్దుకుంటాడో కోహ్లీ అచ్చం అలాగే చేసి అభిమానులను అలరించాడు.

ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2021లో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ధావన్‌ 16 మ్యాచ్‌ల్లో 587 పరుగులతో అదరగొట్టాడు. దీంతో అతడు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అయినా, అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడం గమనార్హం. కోహ్లీ చేసిన సరదా వీడియో మీరూ చూసి ఆస్వాదించండి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details