తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ కుమార్తె 'వామిక' అంటే అర్థం ఇదే.. మరి 'జీవా' అంటే?

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ కుమార్తె పేరు వామిక.. ధోనీ కూతురు జీవా (Dhoni Daughter Ziva).. రోహిత్ కుమార్తె సమైరా.. అయితే ఈ చిన్నారుల పేర్లకు ప్రత్యేకించి కొన్ని అర్థాలున్నాయి. ఇంతకీ అవేంటంటే?

rohit sharma news
విరాట్​ కోహ్లీ

By

Published : Nov 22, 2021, 9:40 AM IST

భారత్​లో క్రికెట్​కు ఉండే క్రేజే వేరు. ఇష్టమైన క్రికెటర్​ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. వారి భాగస్వాములు, పిల్లల గురించి నెట్​లో ఆరా తీస్తారు. ఇటీవలే జన్మించిన తన కుమార్తెకు వామిక (Vamika Kohli) అని పేరు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే వామికతో పాటు ఇతర స్టార్​ క్రికెటర్ల పిల్లల పేర్లకు ప్రత్యేకించి కొన్ని అర్థాలున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?

కూతురితో కోహ్లీ

వామిక కోహ్లీ..

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma baby).. 2021 జనవరి 11న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు 'వామిక' అని పేరు (Virat Kohli Daughter) పెట్టారు. అంటే దుర్గా దేవీ అని అర్థం. దేవతకు మరో పేరు. అంతేకాక, వామిక (VAMIKA) అనే పేరు... విరాట్ (virat)​లోని మొదటి అక్షరం.. Vతో మొదలై.. అనుష్క (anushka)లోని చివరి రెండు అక్షరాలు KAతో పూర్తవడం విశేషం.

వామికతో అనుష్క

జీవా ధోనీ..

కూతురితో ధోనీ, సాక్షి

టీమ్​ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ, సాక్షిల ముద్దుల కూతురు జీవా (Dhoni Daughter). ఈ చిన్నారికి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన క్రేజ్​ ఉంది. మైదానంలో తన అల్లరికి, ఇంట్లో తండ్రితో చేసే సరదాలకు ఫ్యాన్స్​ ఫిదా అవుతుంటారు. జీవా అనే పేరుకు.. ప్రకాశవంతమైనది, కాంతివంతమైనదనే అర్థాలున్నాయి.

గంభీర్​ కూతుళ్లు ఆజీన్, అనైజా..

గంభీర్​ కుటుంబం

టీమ్​ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్​ గంభీర్​కు (Dautam Gambhir Daughter) ఇద్దరు కుమార్తెలు. వారి పేర్లు ఆజీన్, అనైజా. ఆజీన్​ అంటే.. అందమైనది, సౌందర్యం అని అర్థం. అనైజా అంటే గౌరవప్రదమైనదని అర్థం.

ఆగస్త్య పాండ్య..

కొడుకు పాండ్య దంపతులు

ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య, నటాషా స్టాంకోవిక్​లకు 2020 జులైలో మగ బిడ్డ జన్మించాడు. అతడి పేరు అగస్త్య (Hardik Pandya Son Name). అదో రుషి నామం. దానికి అర్థం.. పర్వతం కన్నా అణుకువగా, వినయంగా ఉండేవాడని.

సమైరా..

సమైరాతో రోహిత్, రితిక

టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ, రితికల ముద్దుల కూతురు సమైరా (Rohit Sharma Daughter). 2019లో ఈ పాప జన్మించింది. సమైరా అంటే.. మంత్రముగ్ధులను చేసేది, దేవుడు కాపాడేది అని అర్థాలున్నాయి.

ఇవీ చూడండి:

కోహ్లీ కుమార్తెకు రేప్​ వార్నింగ్..​ కేసుపై సుమోటో విచారణ

'ధోనీని ఆటపట్టిస్తా.. జీవా వినేది అతడి మాటలే'

పెళ్లికి ముందే శుభవార్త చెప్పేశారు!

ABOUT THE AUTHOR

...view details