భారత క్రికెట్ చరిత్రలో 'ది వాల్'గా పేరు గాంచిన రాహుల్ ద్రవిడ్.. కెరీర్ ఆరంభంలో బౌలింగ్ చేశాడన్న విషయం ఎంత మందికి తెలుసు. జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో పార్ట్ టైమ్ బౌలర్‌గా కొన్ని వికెట్లు కూడా తీశాడు.
తన బ్యాటింగ్‌తో వన్డేలతో పాటు టెస్టుల్లో టీమ్ఇండియా తరఫున కొన్నేళ్లపాటు కీలక పాత్ర పోషించాడు ద్రవిడ్. అయితే కెరీర్ ఆరంభంలో బౌలింగ్ చేసిన ఇతడు.. పాకిస్థాన్ ఓపెనర్ సయిద్ అన్వర్, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ లాన్స్ క్లూసెనర్, రైడ్లీ జాకబ్స్ తదితరుల వికెట్లు తీశాడు. మొత్తంగా తన కెరీర్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. జట్టు అవసరాల కోసం కీపింగ్ కూడా చేశాడు.
టెస్టుల్లో 164 మ్యాచ్‌లాడిన ద్రవిడ్.. 42.5 స్ట్రైక్ రేట్‌తో 13వేల పైగా పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో జాకబ్స్ వికెట్‌తో తన ఖాతాలో తొలి వికెట్ వేసుకున్నాడు. వన్డేల్లో 344 మ్యాచ్‌లాడిన రాహుల్.. 71.2 స్ట్రైక్ రేట్‌తో 10వేల మార్క్‌ను అధిగమించాడు. టెస్టు స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన అతడు.. పొట్టి ఫార్మాట్లోనూ ఫర్వాలేదనిపించాడు. ఒకే టీ20లో భారత్‌కు ఆడిన అతడు 31 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ 89 మ్యాచ్‌లాడిన ది వాల్.. 2,174 పరుగులు సాధించాడు.
2015 నుంచి ఇండియా-ఏతో పాటు అండర్-19 జట్లకు కోచ్‌గా పనిచేసిన ద్రవిడ్.. 2019లో జాతీయ క్రికెట్ అకాడమీకి చీఫ్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న టీమ్ఇండియా జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇదీ చదవండి:కివీస్ కీపర్‌కు కోహ్లీ అభినందనలు.. కారణమిదే