IND vs WI ODI Records : విండీస్ పర్యటనలో టీమ్ఇండియా ప్లేయర్లు దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన టెస్ట్ సిరీస్‌లో రాణించిన రోహిత్ సేన.. తొలి వన్డేలోనూ సత్తా చాటారు. తమ అద్భుత ప్రదర్శనతో వెస్టిండీస్ ప్లేయర్లను చిత్తు చేసి ఆధిక్యతతో దూసుకెళ్తున్నారు. అయితే ఈ వేదికగా తొలి వన్డేలో కొంత మంది ప్లేయర్లు తమ ఖాతాల్లో పలు రికార్డులను వేసుకోగా.. రెండో వన్డేలోనూ టీమ్ఇండియాకు చెందిన మరో ముగ్గురు ఆటగాళ్లు తమ ఆటతీరుతో పలు రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నారు. వారెవరంటే..
ఆ పొజిషన్ కోసం జడ్డూ..
Ravindra Jadeja ODI Record :తన బౌలింగ్ స్కిల్స్‌తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు టీమ్ఇండియా ప్లేయర్రవీంద్ర జడేజా. స్వతహాగా ఆల్‌రౌండర్ అయిన జడ్డూ.. విండీస్ పర్యటనలో తన బౌలింగ్ స్కిల్స్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు అతను ఆడిన 30 వన్డేల్లో మొత్తం 44 వికెట్లు పడగొట్టిన ఈ స్టార్ ప్లేయర్.. ఇటీవలే జరిగిన భారత్-వెస్టిండీస్ వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. తన కో ప్లేయర్ ముకేశ్ కుమార్‌తో కలిసి సంయుక్తంగా ఈ రికార్డును నెలకొల్పాడు. అయితే తన కెరీర్‌లో భారత్‌తో ఆడిన 38 మ్యాచుల్లో 44 వికెట్లు తీసి వెస్టిండీస్ దిగ్గజ పేసర్ కోర్ట్నీ వాల్ష్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో శనివారం జరగనున్న రెండో మ్యాచ్‌లో జడేజా కనీసం ఒక్క వికెట్ అయినా సాధించగలిగితే.. భారత్-వెస్టిండీస్ వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నయా రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు.