IPL Match Timings: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల టైమింగ్స్ మారనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ మునుపటి లాగే సాయంత్రం 4 గంటలకు, రాత్రి 8 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ మొదటి 10 సీజన్ల మ్యాచ్‌లు ఈ టైమింగ్స్‌లోనే జరిగాయి. అయితే ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు సాయంత్రం 3:30 గంటలకు, రాత్రి 7:30 గంటలకే జరుగుతున్నాయి. వ్యూవర్షిప్ కోసం అరగంట ముందే మ్యాచ్‌లు నిర్వహించాలని స్టార్‌స్పోర్ట్స్ కోరడం వల్లే బీసీసీఐ ఇందుకు అనుమతిచ్చింది. అయితే ఈ ఏడాదితో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల గడువు ముగుస్తోంది. దీంతో 2023-27 వరకు ఐదేళ్ల పాటు ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బీసీసీఐ మళ్లీ బిడ్లకు ఆహ్వానిస్తోంది. అయితే ఈసారి మ్యాచ్‌లు సాయంత్రం 4, రాత్రి 8గంటలకే ప్రసారం చేయాలని బిడ్‌లో పాల్గొనాలనుకే సంస్థలకు బీసీసీఐ ముందుగానే స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బిడ్‌లో పాల్గొనే సంస్థలు ఐటీ డాక్యుమెంట్లు కొనుగోలు చేసేందుకు బీసీసీఐ మే 20వరకు గడువు ఇచ్చింది. అయితే దీన్ని పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ హక్కులకు రూ.33వేల కోట్లు.. మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పులు! - cricket news latest
IPL News: ఐపీఎల్ మ్యాచ్‌లను వచ్చే సీజన్ నుంచి మళ్లీ సాయంత్రం 4, రాత్రి 8 గంటలకే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఈమేరకు ప్రసార సంస్థలకు స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే వచ్చే ఐదేళ్ల పాటు ఐపీఎల్ టీవీ, ఓటీటీ ప్రసార హక్కుల ధరను రూ.32.8వేల కోట్లుగా నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఐపీఎల్ హక్కులకు రూ.33వేల కోట్లు.. మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పులు!
రూ.32.8 వేలకోట్లు: వచ్చే ఐదేళ్ల పాటు ఐపీఎల్ ప్రసార హక్కుల ధరను బీసీసీఐ రూ.32,890కోట్లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీవీ, డిజిటల్ రైట్స్(ఓటీటీ) కలుపుకొని ఇంత మొత్తాన్ని ఫైనల్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్టార్ ఇండియా, వయాకామ్ 18, సోనీ, అమెజాన్, జీ, డ్రీమ్ 11, సూపర్‌స్పోర్ట్స్, స్కై సంస్థలు ఇప్పటివరకు ఐటీ డాక్యుమెంట్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరి వీటిలో చివరకు ఏ సంస్థ ఐపీఎల్ హక్కులను దక్కించుకుంటుందో చూడాలి.