తెలంగాణ

telangana

ETV Bharat / sports

వారం రోజుల్లోనే IPL.. ఆటగాళ్లను వేధిస్తున్న గాయాలు.. ఎవరెవరు దూరమయ్యారంటే? - ఐపీఎల్ 2023 గాయపడ్డ ఆటగాళ్లు

మరో ఏడు రోజుల్లో ఐపీఎల్ తాజా సీజన్​ ప్రారంభంకానుంది. అయితే ఫ్రాంచైజీలను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే పలువురు కీలక ప్లేయర్స్​ ఈ సీజన్​కు దూరమయ్యారు. ఇప్పటివరకు ఎవరెవరు తాజా ఎడిషన్​కు దూరమయ్యారంటే?

IPL 2023  16th edition players injured list
వారం రోజుల్లోనే IPL.. ఆటగాళ్లను వేధిస్తున్న గాయలు..

By

Published : Mar 24, 2023, 6:23 PM IST

Updated : Mar 26, 2023, 9:08 AM IST

మరో వారం రోజుల్లో భారత్​లో క్రికెట్ పండగ ప్రారంభంకానుంది. ఈ నెల 31 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్​) 16వ సీజన్​ మొదలుకానుంది. దీని కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ కోసం పది ఫ్రాంచైజీల ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే కొంతమంది ప్లేయర్స్​ ప్రాక్టీస్​ కూడా షురూ చేసేశారు. మరికొంతమంది రెండు మూడు రోజుల్లో తమ క్యాంపులకు చేరుకుని శిక్షణ ప్రారంభించనున్నారు. ఈ సీజన్​లో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఏ వ్యూహాలు రచించాలి? వారిని ఎలా దెబ్బ కొట్టాలి? ఎవరిని తుది జట్టులోకి దింపాలి? అంటూ ఆయ ఫ్రాంచైజీలు, వారి కెప్టెన్లు చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే వీటితో పాటు అన్ని ఫ్రాంచైజీలను, క్రికెట్​ అభిమానులను ఓ సమస్య తీవ్రంగా కలవరపెడుతోంది. అదే గాయాల బెదడ. పలువురు ప్లేయర్స్​ ఈ గాయాలా కారణంగా సీజన్​లోని కొన్ని మ్యాచ్​లకు లేదంటే పూర్తి సీజన్​కు దూరమవుతున్నారు. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో తమ ప్రదర్శనతో దుమ్మురేపే స్టార్ పేసర్ జస్ప్రీత్​ బుమ్రా, దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్ రిషభ్ పంత్​ గాయాల కారణంగా దూరమవ్వగా.. మరి కొంతమంది కీలక ప్లేయర్స్​ కూడా లీగ్​కు దూరమయ్యారు. మరి ఇప్పటివరకు ఎవరెవరూ దూరమయ్యారో తెలుసుకుందాం..

  • ముంబయి స్టార్ పేసర్​ బుమ్రా.. వెన్ను గాయం కారణంగా గ‌తేడాది సెప్టెంబ‌ర్ త‌ర్వాత టీమ్ఇండియాకు దూర‌మ‌య్యాడు. ఈ గాయం తీవ్ర‌త త‌గ్గ‌డానికి అనుకున్న‌దానికన్నా ఎక్కువ స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉన్న నేపథ్యంలో ఈ ఐపీఎల్ సీజన్​కు దూరమయ్యాడు.
  • ముంబయికి చెందిన మరో ఆటగాడు జయ్​ రిచర్డ్‌‌సన్.. తుంటి గాయం కారణంగా ఈ మెగాటోర్నీకి అందుబాటులో ఉండట్లేదు. త్వరగా కోలుకోని వచ్చే సీజన్​లో బరిలోకి దిగుతానని అతడే స్వయంగా తెలిపాడు.
  • రాజస్థాన్ రాయల్స్​ జ‌ట్టు ప్ర‌ధాన పేస‌ర్ ప్ర‌సిధ్ కృష్ణ కూడా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇతడు వెన్నునొప్పితో బాధపడుతున్నాడు.
  • దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ రిషభ్ పంత్.. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇతడు దూరమయ్యాడు.
  • రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు ప్లేయర్​ విల్ జాక్స్ కూడా ఇటీవలే బంగ్లాదేశ్​తో జరిగిన వన్డే సిరీస్​లో గాయప్డడాడు. ఈ కారణంగా అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
  • పంజాబ్ కింగ్స్​ ఆటగాడు జానీ బెయిర్ స్టో.. గతేడాది కాలి గాయం బారిన పడ్డాడు. అయితే ప్రస్తుతం అతడు ఫిట్​గానే ఉన్నాడు. కానీ రాబోయే యాషెస్​ సిరీస్​ను దృష్టిలో పెట్టుకుని తాజా సీజన్​కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు.
  • కోల్​కతా నైట్​ రైడర్స్​ శ్రేయస్ అయ్యర్ కూడూ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతడికి సర్జరీ చేయించుకోనున్నాడు. ఈ కారణంగా అతడు అందుబాటులో ఉండట్లేదు. కానీ దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
  • కోల్​కతాకు చెందిన మరో ప్లేయర్​ లాకీ ఫెర్గూసన్ కూడా మోచేతి గాయం కారణంగా 16వ ఎడిషన్​లో ఆడే అవకాశాలు కనిపించట్లేదు.
  • చెన్నై సూపర్ కింగ్స్​ ఆటగాడు ముఖేష్ చౌదరి ఆడేది అనుమానంగానే మారింది. అతడిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
  • భారత జట్టు ఎంట్రీ కోసం ఎదురచూస్తున్న లఖ్​నవూ ప్లేయర్​ మోహ్సిన్ ఖాన్ కూడా ఆడేది అనుమానంగానే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
  • చెన్నై సూపర్​ కింగ్స్​ కైల్ జెమీసన్ నడుము నొప్పితో దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: గుజరాత్​ టైటాన్స్​ కెప్టెన్​గా గిల్​!.. హార్దిక్ పోస్ట్​కు స్పాట్​ పెట్టాడుగా!

Last Updated : Mar 26, 2023, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details