ఐసీసీ టీ20 ప్రపంచకప్(T20 worldcup schedule) ప్రారంభ టోర్నీలోనే టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. తర్వాత మరో పొట్టి కప్పు సాధించాలని చూసినా కుదరలేదు. అప్పటి నుంచి కలగానే మిగిలిపోయింది. ఈసారైనా కప్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ మెగాటోర్నీలో సత్తా చాటేందుకు టీమ్ఇండియా సంసిద్ధంగా ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో వార్మప్ మ్యాచ్‌లు కూడా ఆడింది. అయితే ఈ మెగాటోర్నీలో సత్తాచాటాలంటే భారత జట్టులో బ్యాట్స్‌మెన్ కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్‌తో పాటు బౌలర్లు అశ్విన్, జడేజా, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఎంతో కీలకం. బౌలర్లలో అశ్విన్, జడేజాకు అయితే గత ప్రపంచకప్‌ల్లో మంచి రికార్డులను అందుకున్న అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో ఓ తెలుసుకుందాం..
రవిచంద్రన్ అశ్విన్
టీ20 ప్రపంచకప్‌లో(ravichandran ashwin t20 wickets) భారత్ తరఫున ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటివరకు 15మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీశాడు. తన చివరి టీ20 మ్యాచ్‌ను 2017లో వెస్టిండీస్‌పై ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ ఇతడు అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.
హర్భజన్ సింగ్
2007-2012వరకు(harbhajan singh wickets) పొట్టి క్రికెట్ ఆడిన హర్భజన్ సింగ్.. టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 2007 వరల్డ్‌కప్‌లో అత్యధిక(4) మెయిడిన్ ఓవర్లు వేసిన ప్లేయర్‌గానూ రికార్డుకెక్కాడు. ఇప్పటివరకు 16 వికెట్లు తీశాడు.
ఆశిష్ నెహ్రా
పొట్టి క్రికెట్లో(ashish nehra world record) 2009 నుంచి 2016 వరకు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా.. టీ20 స్పెషలిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచకప్‌లో తాను ఆడిన మ్యాచ్‌ల్లో 17.93 సగటు, 6.89ఎకానమీతో 15వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.