హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అధికారిని తానే అని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ వర్మ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం తాను పంపిన మెయిల్లోని అంశాలను తప్పుగా అర్థం చేసుకుని, తాను అంబుడ్స్‌మన్‌గా తప్పుకున్నానని వదంతులు ప్రచారం చేస్తున్నారని ఆయన సాయంత్రం మరో మెయిల్లో స్పష్టతనిచ్చారు.
"హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అధికారిగా ఇద్దరు వేర్వేరు మాజీ న్యాయమూర్తులను నియమించినట్లు కార్యదర్శి విజయానంద్ నుంచి నాకు లేఖ అందింది. ఈ వివాదం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఉన్న గొడవల్లోకి నన్ను లాగొద్దు" అని తన మొదటి మెయిల్లో ఆయన పేర్కొన్నారు. దీంతో ఆయన అంబుడ్స్‌మన్‌గా తప్పుకున్నారంటూ ఓ వర్గం ప్రచారం చేసింది.