గత 10- 12 ఏళ్లలో భారత క్రికెట్ జట్టు చాలా ముందుకెళ్లిందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్(Inzamam-ul-Haq) అభిప్రాయపడ్డాడు. దేశంలోని వివిధ స్థాయిల్లో క్రికెట్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపాడు.
"2010 వరకు భారత్, పాక్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగేవి. కానీ గత 10- 12 ఏళ్లలో భారత్ తన ఆటతీరును ఎంతో మెరుగుపరుచుకుంది. పాక్, శ్రీలంక జట్లను దాటి చాలా ముందుకెళ్లింది. ఈ ఘనత కచ్చితంగా ఐపీఎల్‌దే. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ కూడా భారత క్రికెట్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించింది. బీసీసీఐ దగ్గర చాలా నిధులున్నాయి. ఆటగాళ్లకు శిక్షణ పరంగా అత్యుత్తమ వసతులు అందుబాటులోకి వచ్చాయి. పటిష్టమైన దేశవాళీ వ్యవస్థతో టీమ్‌ఇండియా ప్రయోజనాల్ని పొందుతోంది. పాక్, శ్రీలంక మాత్రం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌ను అంతగా అభివృద్ధి చేయలేకపోయాయి."