టీమ్ఇండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్‌కు(Parthiv Patel News) పితృవియోగం కలిగింది. పార్థివ్ తండ్రి అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ మరణించారు. అనారోగ్యం కారణంగా తన తండ్రి(Parthiv Patel Father) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు పార్థివ్ పటేల్ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన పలువురు క్రికెటర్లు కామెంట్లు చేసి పార్థివ్ పటేల్‌కు సంఘీభావం తెలిపారు.
"నా తండ్రి అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ మరణించారని చెప్పేందుకు చింతిస్తున్నాను. సెప్టెంబరు 26(ఆదివారం) ఆయన తనువు చాలించారు. నా తండ్రి ఆత్మశాంతి చేకూరేలా ప్రార్థన చేయాలని మిమ్మల్ని(ఫ్యాన్స్) ప్రార్థిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక".
- పార్థివ్ పటేల్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
పార్థివ్ పటేల్ తండ్రి అజయ్ పటేల్ గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడ్డారు. ఆయన్ని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించినా.. లాభం లేకపోయిందని పార్థివ్ సన్నిహితులు చెబుతున్నారు. ఆస్పత్రిలో ఉన్న తండ్రి బాగోగులతో పాటు ఐపీఎల్‌లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు పార్థివ్ పటేల్.
గతేడాది డిసెంబరులో పార్థివ్ పటేల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు(Parthiv Patel Retirement) పలికాడు. దాదాపుగా 17 ఏళ్ల పాటు సాగిన క్రికెట్ కెరీర్లో ఎన్నో ఘనతలను సాధించాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో(Parthiv Patel Cricket Career) అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. దాదాపుగా 65 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి.. 1706 పరుగులు నమోదు చేశాడు.
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఎక్కువ సీజన్లలో(Parthiv Patel IPL Contract) ప్రాతినిధ్యం వహించాడు. అంతకుముందు ఈ టోర్నీలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, డెక్కన్ ఛార్జెస్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోచి టస్కర్స్ కేరళ జట్లలో ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్(Parthiv Patel IPL 2021) వ్యాఖ్యాతల ప్యానల్లో భాగమయ్యాడు.
ఇదీ చూడండి..IPL 2021: బెంగళూరు-ముంబయి.. గెలుపుబాట పట్టేదెవరు?