పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్య స్థానంలో శార్దుల్ ఠాకూర్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే బౌలింగ్‌కు దూరంగా ఉంటున్న హార్దిక్.. టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్‌లు వేయలేడని తెలిపాడు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే శార్దుల్‌ను సానబెట్టాలని సూచించాడు.
"ఇటీవల బ్యాటింగ్‌కే పరిమితమైన పాండ్య.. వెనునొప్పి కారణంగా బౌలింగ్‌లో సుదీర్ఘ స్పెల్‌లు వేయడం లేదు. దీంతో మరో అదనపు బౌలర్‌ను జట్టులోకి తీసుకోవాల్సి వస్తోంది. అతడు పూర్తి స్థాయిలో బౌలింగ్ ఎప్పుడు ప్రారంభిస్తాడో తెలియడం లేదు. కాబట్టి, హార్దిక్ స్థానంలో శార్దుల్ వంటి ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాలి. విజయ్ శంకర్, శివమ్ దూబే వంటి వారిని ఎక్కువ మ్యాచ్‌ల్లో ఆడించాలి," అని శరణ్‌దీప్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీతో పాటు స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో శార్దుల్ మంచి ప్రదర్శన చేశాడు. బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించి జట్టుకు మంచి ఆల్‌రౌండర్‌గా మారాడు. దీంతో రాబోయే కాలంలో అతడు జట్టులో కీలక ఆటగాడిగా మారే అవకాశం ఉందని శరణ్‌దీప్ అభిప్రాయపడ్డాడు.