తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్ఇండియా కోచ్ పదవికి ద్రవిడ్ దరఖాస్తు! - రాహుల్ ద్రవిడ్ న్యూస్ టుడే

టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ పదవికి రాహుల్ ద్రవిడ్(Rahul Dravid Coach News) దరఖాస్తు చేసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. భారత మాజీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman Latest News) జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాయి.

rahul dravid, vvs laxman
వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్

By

Published : Oct 26, 2021, 5:00 PM IST

Updated : Oct 26, 2021, 6:13 PM IST

భారత పురుషుల జట్టు కొత్త కోచింగ్ బృందం కోసం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)(BCCI News) ఇటీవలే దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు హెడ్​ కోచ్​ పదవికి టీమ్​ఇండియా మాజీ దిగ్గజం రాహుల్ ద్రవిడ్(Rahul Dravid Indian Team Coach) దరఖాస్తు చేసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

"రాహుల్ ద్రవిడ్ టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించాడు. బీసీసీఐకి దరఖాస్తు సమర్పించాడు. బ్యాటింగ్​ కోచ్​గా విక్రమ్ రాఠోడ్​ను నియమించే అవకాశముంది. ప్రస్తుతం భారత జట్టులో మేటి యువ ఆటగాళ్లున్నారు. ద్రవిడ్ కోచింగ్ సాయంతోనే వీరు టీమ్​ఇండియా సీనియర్​ జట్టులోకి అడుగు పెట్టారు" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

కాగా, దిగ్గజ బ్యాట్స్​మన్ వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman Latest News) జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ద్రవిడ్ స్థానంలో లక్ష్మణ్ ఈ బాధ్యతలు చేపట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్​ అనంతరం.. టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త సహాయ బృందం ఎంపికలో పడింది బీసీసీఐ. హెడ్​కోచ్ పదవితో పాటు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ పదవులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు నిర్దేశించిన గడువులోగా అప్లికేషన్లు సమర్పించాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

టీమ్​ ఇండియాకు కొత్త కోచ్​.. బీసీసీఐ ప్రకటన!

Last Updated : Oct 26, 2021, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details