హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు పితృవియోగం - hca president father died
21:38 October 18
అజారుద్దీన్ తండ్రి కన్నుమూత
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మహమ్మద్ యూసుఫ్ కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన... ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురై కొన్ని రోజుల నుంచి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో నేడు(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంలో అజారుద్దీన్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. యూసుఫ్ అంత్యక్రియలు రేపు(బుధవారం) బంజారాహిల్స్‌లో నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: T20 worldcup: ఎక్కువ సార్లు డకౌట్ అయిన ప్లేయర్స్ ఎవరంటే?