ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ శుభవార్త చెప్పింది. స్వలింగ సంపర్కురాలైన ఈ ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్.. తన పార్ట్నర్ గర్భం దాల్చిందంటూ ట్వీట్ చేసి హర్షం వ్యక్తం చేసింది. డయానా అనే మహిళతో రిలేషన్షిప్లో ఉన్న సారా.. అమ్మ కావాలనేది తన భాగస్వామి కోరికని పేర్కొంది.
"అమ్మకావాలనేది నా పార్ట్నర్ డ్రీమ్. ఆ ప్రయాణం అంత సులువు కాదు. అయితే డయానా ఈ విషయంలో పట్టువదల్లేదు. ఆమె బెస్ట్ మదర్ అవుతుందని నాకు తెలుసు. నేను ఈ ఫ్యామిలీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మరో 19 వారాల్లో మా జీవితం పూర్తిగా మారిపోనుంది." అని సారా టేలర్ రాసుకొచ్చింది. దీంతో అభిమానులు, నెటిజన్లు సారా టేలర్‌కు తెలుపుతున్నారు.
వరల్డ్‌లోని టాప్ వికెట్ కీపర్ బ్యాటర్లలో సారా టేలర్ ఒకరు. 2006లో భారత్‌పై జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆమె.. 2019లో ఆటకు వీడ్కోలు పలికింది. 2016లో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా ఆట నుంచి విరామం తీసుకున్న సారా.. తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
మొత్తంగా ఇంగ్లాండ్ తరఫున 10 టెస్టులు(300 పరుగులు), 126 వన్డేల్లో(4056 రన్స్, 7 సెంచరీలు 20 హాఫ్ సెంచరీలు), 90 టీ20లు ఆడింది. ఏడు సెంచరీలు చేసిన సారా 20 హాఫ్ సెంచరీలు బాదింది. 90 టీ20 ఇన్నింగ్స్‌ల్లో(2177, 16 అర్ధ శతకాలు) ఆడింది. వికెట్ కీపర్‌గా 138 క్యాచులు అందుకుంది. 104 స్టంపౌట్లు చేసింది. మూడుసార్లు ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా సెలెక్ట్ అయింది. అలా తన కెరీర్లో 2009, 2017 వన్డే వరల్డ్ కప్‌తోపాటు 2009 టీ20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ జట్టులో ఆమె సభ్యురాలుగా ఉంది.
రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది సారా. మెన్స్ టీమ్‌కు కోచ్‌గా పనిచేసిన తొలి మహిళా క్రికెటర్‌గానూ రికార్డుకెక్కింది. అబుదాబీ టీ10 లీగ్‌లో అబుదాబీ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ పురుషుల కౌంటీ టీమ్ సుసెక్స్ టీమ్‌కు స్పెషలిస్ట్ కోచ్‌గానూ వ్యవహరించింది. ఇకపోతే ఆటకు వీడ్కోలు పలికినప్పటి నుంచి టేలర్ కుటుంబంతోనే గడుపుతోంది. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే టేలర్.. డయానా ప్రెగ్నెన్సీ విషయాన్ని మాత్రం అభిమానులతో పంచుకుంది.
ఇదీ చూడండి:WPL 2023: దీప్తి శర్మకు షాక్.. యూపీ వారియర్స్ కెప్టెన్‌గా ఆసీస్ బ్యాటర్