Yuvraj Singh World Cup : ఈసారి భారత్ వేదికగా జరగబోయే ప్రపంచకప్‌నకు దాదాపు మూడు నెలల సమయం ఉంది. ఇందుకోసం ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ఆయా జట్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఎవరి బలాబలాలు ఎలాగున్నా.. తమ దేశం తరఫున ప్రాతినిథ్యం వహించే జట్టే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తారు ఎవరైనా. కానీ, ఇందుకు భిన్నంగా కామెంట్స్ చేశాడు టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా టైటిల్‌ను గెలుస్తుందనే నమ్మకం నాకైతే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే టైటిల్ గెలవాలంటే ఏం చేయాలో అని కూడా పలు సూచనలు చేశాడు.
'భారత్ ఈసారి వరల్డ్‌కప్ గెలవడం కష్టమే'.. యువీ సంచలన వ్యాఖ్యలు - వన్డే వరల్డ్ కప్
Yuvraj Singh World Cup : ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ సమరం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వన్డే ప్రపంచకప్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. ఇంతకీ యువీ ఏమన్నాడంటే?
నిజాలు ఒప్పుకోక తప్పదు..
'నిజాయితీగా చెప్పాలంటే ఈసారి టీమ్ఇండియా.. వన్డే వరల్డ్‌కప్‌ను గెలుస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. ఓ దేశ భక్తుడిగా భారత్ గెలుస్తుందని చెప్పవచ్చు. కానీ జట్టు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా భారత జట్టు మిడిల్ ఆర్డర్ చాలా బలహీనంగా ఉంది. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ గాయాల కారణంగానే మిడిల్ ఆర్డర్‌లో సరైన ప్లేయర్లు కనిపించడం లేదు.'అని ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో తెలిపాడు యువీ.
రోహిత్ రాణిస్తేనే..
'కెప్టెన్ రోహిత్ శర్మ గొప్ప ఆటగాడని అన్నాడు యువరాజ్. కానీ అతడు కొన్నాళ్లుగా ఫామ్‌లో లేడని అంతా అంటున్నారుని.. అది జట్టుకు అంత పెద్ద సమస్యేమి కాదని తెలిపాడు యూవీ. 'ఎందుకంటే 2019 వన్డే ప్రపంచకప్‌నకు ముందు కూడా రోహిత్ పేలవమైన ఆటతీరును ప్రదర్శించాడు. అంతేకాకుండా ఐపీఎల్ 2019 సీజన్‌లో కూడా హిట్ మ్యాన్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. అయినా 2019 వరల్డ్‌కప్‌లో 5 సెంచరీలు బాది మంచి ఫామ్‌లోకి వచ్చాడు. కనీసం 20 మంది ప్లేయర్లనైనా ప్రపంచకప్ సమరానికి సిద్ధం చేయాలి. టాప్ ఆర్డర్‌లో రోహిత్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ ఉండటం వల్ల జట్టు పటిష్ఠంగా ఉంది. కోలకతా నైట్‌రైడర్స్ స్టార్ ప్లేయర్ రింకూ సింగ్ ప్రస్తుతం చాలా బాగా రాణిస్తున్నాడు. అతడిని లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌కు దింపితే బాగా రాణిస్తాడు' అని యువరాజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.