తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్యాన్స్​ జాగ్రత్త, భారత్​ పాక్​ మ్యాచ్ చూస్తే రూ.5 వేలు జరిమానా - ఇండియా పాక్​ మ్యాచ్ చూస్తే ఫైన్​

Asia Cup 2022 IND VS PAK match ఆసియా కప్‌ 2022లో భాగంగా నేడు జరగనున్న టీమ్​ఇండియా పాకిస్థాన్​ మ్యాచ్​ చూడారాదంటూ ఓ కాలేజీ ఆంక్షలు జారీ చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

Five thousand Fine For India Pak Match
భారత్​ పాక్​ మ్యాచ్​ చూస్తే రూ.5 వేలు జరిమానా

By

Published : Aug 28, 2022, 2:21 PM IST

Asia Cup 2022 IND VS PAK match ఆసియా కప్‌ 2022లో భాగంగా మరి కొన్ని గంటల్లో టీమ్​ఇండియా-పాకిస్థాన్​ మ్యాచ్​ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్​ వీక్షిస్తే కఠిన చర్యలు తప్పవని ఓ ఇన్​స్టిట్యూట్​ ఆంక్షలు విధించింది.

శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) యాజమాన్యం ఈ ఆంక్షలు విధించినట్లు కథనాలు వస్తున్నాయి. విద్యార్థలు గ్రూపులుగా ఈ మ్యాచ్​ చూడరాదని ఆదేశాలు జారీ చేసిందట. మ్యాచ్‌ ముగిసిన తర్వాత విద్యార్ధులు ఎలాంటి మీటింగ్‌లు పెట్టవద్దని చెప్పినట్లు తెలిసింది. ఒకవేళ తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. వారికి రూ.5000 జరిమానాతో పాటు డిబార్​ చేస్తామని హెచ్చరించిందట.

కాగా, చివరిసారిగా ఇరు దేశాలు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో తలపడగా.. అక్కడ భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. దాయాది చేతిలో భారత్‌ 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్‌లో పాక్‌పై ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్​ఇండియా పట్టుదలగా ఉంది.

ఇదీ చూడండి:భారత్​ పాక్​ మ్యాచ్​పై కెప్టెన్​ రోహిత్​ కామెంట్​, ఆ విషయం చాలా సీక్రెట్​ అంటూ

ABOUT THE AUTHOR

...view details